మ‌న దేశంలో అత్యంత ఖ‌రీదైన టాప్ 5 ఇండ్లు ఎవ‌రివో మీకు తెలుసా..?

సొంతిల్లు క‌ట్టుకోవాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి.కాక‌పోతే ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్టు వారు కట్టుకుంటారు.

 Do You Know Any Of The Top 5 Most Expensive Houses In The Country ..?, Expensive-TeluguStop.com

మ‌రి మ‌న దేశంలోనే చాలా ఖ‌రీదైన ఇల్లు ఎవ‌రిదో మీకు తెలుసా.ఈ ప్ర‌శ్న విన‌గానే ఓ పేరు ఇప్ప‌టికే మీకు గుర్తుకు వ‌చ్చే ఉంటుంది.

అదేనండి దేశంలోనే అత్యంత ధ‌నికుడైన ముఖేష్ అంబానీదే.ఆ ఇంటిపేరు ఏంటిల్లా.

మనదేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఖరీదైన ఇల్లుగా దీనికి గుర్తింపు ఉంది.దీని ధర 7 వేల 337 కోట్లుగా ఉందంట‌.

దీన్ని అంబానీ త‌న భార్య‌కు గిఫ్టుగా క‌ట్టించార‌ని చెప్తుంటారు.ఇక ఇందులో 27 ఫ్లోర్లు ఉన్నాయి.

ఇక్క‌డ వివేషం ఏంటంటే ఇందులోని దాదాపు 6 ఫోర్లు కేవలం పార్కింగ్ కు ఉంచారంటే ఎంత ల‌గ్జ‌రీగా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఇండ్ల‌లో ఇది కూడా ఒక‌టి.

ఇక మ‌న ఇండియాలో దీని త‌ర్వాత రెండో స్థానంలో ఎబోడ్ ఉంది.అనిల్ అంబానీకి బాంద్రాలో ఈ ఇల్లు ఉంది.

దీని విలువ కూడా దాదాపుగా 5 వేల కోట్లకు పైగాన ఉందంట‌.అయితే ఇందులో 66 అంతస్థులు ఉండ‌టం విశేషం.

ఇక మూడో స్థానంలో సైరస్ పూణావాలాకు చెందిన ముంబైలోని బీచ్ క్యాండీలో ఏరియాలో క‌ట్టిన‌టువంటి కాన్సులేట్ బిల్డింగ్ ఉంది.

Telugu Ambani, Anil Ambani, Kumara Mangalam, Mukush Abani-Latest News - Telugu

అయితే దీని ధ‌ర మాత్రం రూ.750 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు.ఇక నాలుగో ప్లేస్ లో జిటియా హౌస్ ఉంది.

ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళంది ఈ జిటియా హౌస్.కాగా దీని ధ‌ర రూ.425 కోట్లు ఉంది.అయితే వీటి త‌ర్వాతి ఐదో స్థానంలో బాలీవుడ్ బాద్ షా అయిన షారుఖ్ ఖాన్ ఇళ్లు ఉంది.

షారుఖ్ కూడా ముంబ‌యిలోనే క‌ట్టుకున్నాడు.దీని పేరు మన్నత్ గా పిలుచుకుంటున్నాడు.

అయితే ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ చెప్పిన వివ‌రాల మేర‌కు షారుఖ్ ఇల్లు కూడా 2 వందల కోట్లు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube