మహేష్ బాబు ఫస్ట్ లవ్ స్టోరీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే.మహేష్ బాబుకి, తన అందానికి, స్టైల్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

 Do You Know About Maheshbabu First Love Details, Mahesh Babu, First Love, Tolly-TeluguStop.com

అంతేకాకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు.

ఇకపోతే మహేష్ బాబు తన చిన్నతనంలోనే తన తండ్రి కృష్ణ సినిమాలో బాలనటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే అప్పట్లో విజయశాంతి కృష్ణ కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కృష్ణ కొడుకుగా మహేష్ బాబు అద్భుతంగా నటించాడు.

అప్పటి నుంచి విజయశాంతితో మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉండేది.అలా మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటే మహేష్ బాబు కోసం ఆమె ప్రత్యేకంగా తనను ఇంటికి తీసుకువెళ్ళి మహేష్ బాబు కోసం పలు రకాల ఆహారపదార్థాలు స్వయంగా చేసి వడ్డించేది.

Telugu Love, Kodukudiddina, Mahesh Babu, Krishna, Tollywood, Vijay Shanthi, Vija

మహేష్ బాబు పలు సందర్భాలలో తన ఫస్ట్ లవ్ విజయశాంతి అని తెలిపారు.అలా విజయశాంతి హీరోయిన్ గా నటించిన పలు సినిమాలలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.ఆ తర్వాత చాలాకాలం పాటు గ్యాప్ తీసుకున్న తరువాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తూ మొదటిసారిగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది.ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube