దక్షిణ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు.
చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
విజయకాంత్ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
విజయకాంత్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి.1952 ఆగస్ట్ 25వ తేదీన మధురైలో జన్మించారు.సినిమాల్లో అడుగుపెట్టిన తరువాత ఆయన తన పేరును విజయకాంత్ గా మార్చుకున్నారు.27 ఏళ్ల వయసులో ఇనిక్కుమ్ ఇలమై అనే చిత్రంతో అరంగేట్రం చేశారు.దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం.
హీరోగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ విజయకాంత్ రాణించారు.
తరువాత 2005 వ సంవత్సరంలో విజయకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.ప్రజలకు సేవ చేయాలనే తపనతో డీఎండీకే పార్టీని స్థాపించారు.2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన విజయాన్ని సాధించారు.తరువాత 2016లో విజయకాంత్ ఓటమి పాలయ్యారు.2011 నుంచి 2016 సంవత్సరం వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.