కమల్ హాసన్( Kamal Haasan ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానుల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నారు కమల్ హాసన్.చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ మొదటి సినిమాకే రాష్ట్రపతి అవార్డును( Rashtrapati Award ) అందుకున్నారు.
అలా మొదలైన కమల్ సినీ ప్రయాణం ఎవరూ చేయలేని పాత్రలు, ఎన్నో సాహసాలు, మరెన్నో అవార్డులు అందుకొని లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు కమల్ హాసన్.ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ పై ఒక డైరెక్టర్( Director ) షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు అన్న విషయాన్ని వస్తే.మాములుగా కమల్ హాసన్ లాంటి స్టార్ తో పని చెయ్యడం ఏ డైరెక్టర్ కి అయినా ఒక అదృష్టం లాంటిది.రాజమౌళి, శంకర్ లాంటి డైరెక్టర్స్ కూడా కమల్ హాసన్ తో సినిమాలు చెయ్యాలని పరితపిస్తూ ఉంటారు.
కానీ ఒక తమిళ స్టార్ డైరెక్టర్ మాత్రం కమల్ హాసన్ తో సినిమా చేసే బదులు కమెడియన్ తో ( Comedian ) సినిమా చెయ్యడం బెటర్ అని అనుకుంటున్నాడు.ఇతని కెరీర్ లో ఒకే ఒక్క సినిమా మినహా, మిగిలినవన్నీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి.అయినా కూడా ఇంత పొగరు అవసరమా అని అంటున్నారు నెటిజెన్స్.కానీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.అతను కమల్ హాసన్ తో సినిమా చెయ్యడానికి రెడీ , కానీ కమల్ హాసన్ డేట్స్ ఖాళీగా లేవు.కమల్ హాసన్ తో సినిమాకి ముందు కార్తీ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
కానీ కార్తీ ( Karthi ) డేట్స్ కూడా ఖాళీగా లేవు.గతంలో కార్తీతో కలిసి ఆయన ఖాకీ( Khakee ) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసాడు.ఈ సినిమా తర్వాత అజిత్ తో రెండు సినిమాలు చేసాడు కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు.తన దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న కమల్ హాసన్, కార్తీల డేట్స్ ఖాళీ లేదు.
దీంతో సమయం వృధా చెయ్యకుండా, కమెడియన్ యోగిబాబు ని( Comedian Yogibabu ) హీరోగా పెట్టి ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు డైరెక్టర్ హెచ్.వినోద్.
( H Vinoth ) పొలిటికల్ నేపథ్యం లో సాగే సినిమా వినోదభరితంగా ఉంటుందట.