భారత్- పాకిస్తాన్ రైల్వే వ్యవస్థల్లో ఎన్ని తేడాలున్నాయో తెలుసా?

భారతదేశం- పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ ఇరు దేశాల వ్యవహారం తరచూ చర్చకువస్తుంటుంది.భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఎలావున్నప్పటికీ, భారత ప్రజలు పాకిస్థాన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

 Difference Between Pakistan And Indian Trains Details, India, Pakistan, Indian R-TeluguStop.com

భారతీయులు పాకిస్తాన్ ప్రజలను, వారి జీవనశైలిని చూడాలని అనుకుంటారు.అటువంటి పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ రైల్వేల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం, వీటిని తెలుసుకున్నాక పాకిస్తాన్ రైల్వేలు భారతదేశానికి ఎంత భిన్నంగా ఉన్నాయో అర్థం అవుతుంది.

ఇదేకుండా పాక్‌లోని రైళ్లు, ఆయా స్టేషన్ ఫొటోలను చూసినప్పుడు భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదని అనిపిస్తుంది.

అక్కడి స్టేషన్లు, రైళ్లు భారతదేశాన్ని పోలి ఉంటాయి.

కానీ ఇప్పుడు భారతదేశంలోని స్టేషన్లు, లగ్జరీ సేవల పరంగా ఎంతో పురోగతి సాధించింది.పాకిస్తాన్ రైల్వేల ప్రత్యేకత ఏమిటంటే.

అవి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలను తన రైలు నెట్‌వర్క్‌తో కలుపుతుంది.అయితే, భారతీయ రైల్వేలు పాకిస్థాన్ రైల్వేల కంటే ఎంతో అభివృద్ధి చెందాయి.

ఇక్కడి రైళ్లు, స్టేషన్లు మొదలైనవి చాలా హైటెక్ స్థాయికి చేరాయి.

Telugu India, Indiapakistan, India Trains, Indian Railway, Pakistan, Pakistan Tr

బ్రిటీష్ కాలంలోనే పాకిస్తాన్‌లో రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి.1861లో పాక్‌లో రైలు సేవలు ప్రారంభమయ్యాయి.అక్కడ కూడా భారతదేశంలో మాదిరిగా జాతీయ పండుగలలో స్టేషన్‌లో అలంకరణలు చేస్తారు.

వికీపీడియాలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ రైల్వేలలో 72 వేల మందికి పైగా పని చేస్తున్నారు.అంటే పాకిస్తాన్ రైల్వేల నెట్‌వర్క్ కూడా చాలా పెద్దది.పాకిస్తాన్ రైల్వేల నెట్‌వర్క్ 11881 కి.మీ.లో టోర్ఖమ్ నుండి కరాచీ వరకు విస్తరించి ఉంది.పాకిస్తాన్ రైల్వేలు ప్రతి సంవత్సరం 70 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube