చంద్రబాబు నాయుడు అసలు బెయిల్ కి అప్లై చెయ్యలేదా..? ఇంత నాటకాలు ఎందుకు!

గత రెండు మూడు రోజులుగా ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయో మన అందరికీ తెలిసిందే.తెలుగు పార్టీ అధినేత, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్ర బాబు నాయుడుని ‘స్కిల్ డెవలప్మెంట్’ స్కాం లో A1 నిందితుడిగా పరిగణించి సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.14 రోజుల పాటు రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ లో ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం తో చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )ని అక్కడికి షిఫ్ట్ చేసారు.చంద్ర బాబు అరెస్ట్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలకర్తలు బందులు, రాస్తారోకోలు నిర్వహించారు.

 Didn't Chandrababu Naidu Apply For Bail Why So Many Dramas , Chandrababu Naidu,-TeluguStop.com

తెలుగు దేశం పార్టీ కి మద్దతుగా జనసేన పార్టీ కూడా నిలిచి, ఆ పార్టీ నాయకులూ కూడా ఈ బంద్ లో శాంతియుతంగా పాల్గొన్నారు.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే అసలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తరుపున ఉన్న లాయర్ ఇప్పటి వరకు బెయిల్ కి అప్లై చేయలేదట.

బెయిల్ కి అప్లై చెయ్యకుండానే నాటకాలు ఆడుతున్నారని వైసీపీ( YCP ) ప్రభుత్వ మద్దతు దారులు తెలియచేస్తున్నారు.జైలు లో కూర్చొని సింపతీ డ్రామా వేసేందుకే నేడు చంద్ర బాబు ప్రయాణం చేస్తున్నాడని, ఇలాంటి నాటకాలు ఆడడం ఆయనకీ కొత్తేమి కాదని అంటున్నారు.

మరో పక్క చంద్ర బాబు నాయుడు జైలు కి వెళ్లడాన్ని తట్టుకోలేక 27 మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని, త్వరలోనే బాలయ్య బాబు( Balayya Babu ) వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించబోతున్నాడని టాక్.ఇదంతా చూస్తుంటే ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారమే యవ్వారం నడిపిస్తున్నట్టు ఉందని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ లో తెలుగు దేశం పార్టీ నాయకులూ అంత ఉత్సాహంగా పాల్గొనలేదు.

తెలుగు దేశం పార్టీ శ్రేణుల కంటే సపోర్టుగా నిలబడిన జనసేన పార్టీ ( Janasena party )కార్యకర్తలే బంద్ లో ఎక్కువగా పాల్గొన్నారని, అలాంటిది 27 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అంటే నమ్మశక్యంగా లేదని, ప్రతీ రోజు చనిపోయే వారి లిస్ట్ కనుక్కొని, చంద్ర బాబు అరెస్ట్ ఖాతాలో వేసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.మావో పక్క చంద్ర బాబు నాయుడు కనీసం మూడు నెలలపాటు జైలు నుండి బయటకి వచ్చే ఛాన్స్ లేదని కూడా అంటున్నారు.అదే కనుక జరిగితే తెలుగు దేశం పార్టీ కి ప్లస్ అవుతుందా, లేదా మైనస్ అవుతుందా అని విశ్లేషకులు ఆరాలు తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube