సొంత ఇంట్లో చోరీ చేసిన మహిళ.. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి..!

సొంత ఇంట్లో దొంగతనం చేసిన మహిళతోపాటు మరో ఇద్దరు నిందితులను హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీసులు( Mir Chowk Police ) అరెస్టు చేసి వారి వద్ద నుండి 56 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.అందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.

 Hyderabad Police Arrest Woman Robbery In Her Own House Details, Hyderabad ,polic-TeluguStop.com

సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ లోని ఉస్మాన్ పురాలో జాహుర్ హుస్సేన్, ఫరీదా బేగం అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం ఫరీదా బేగం( Farida Begum ) ఆన్లైన్ లో పేపర్ కటింగ్, ప్రింటింగ్ మిషన్లను ఆర్డర్ చేసింది.డబ్బులు చెల్లించిన మిషన్లు మాత్రం రాకపోవడంతో సప్లయర్ కు ఫోన్ చేయగా మరికొంత డబ్బు పంపించాలని తెలిపాడు.

ఆ తర్వాత సప్లయర్ మిషన్లను పంపించాడు.

Telugu Farida Begum, Gold Theft, Hyderabad, Jahoor Hussian, Mir Chowk, Loan App,

అయితే మిషన్ల ద్వారా ఎలాంటి ఉత్పత్తి చేయకపోవడంతో ఫరీదా బేగం పై ఆమె భర్త జహూర్ హుస్సేన్( Jahoor Hussain ) అసహనం వ్యక్తం చేశాడు.అయితే సప్లయర్ కేవలం మిషన్లను మాత్రమే పంపించాడు.ముడి సరుకులు పంపించలేదు అనే విషయం భర్తకు చెప్పకుండా త్వరలోనే వ్యాపారం ప్రారంభం అవుతుందని భర్తతో ఫరీదా బేగం చెప్పింది.భర్తకు తెలియకుండా ఫరీదా బేగం నగలు అమ్మి రూ.84000 మరికొన్ని నగలు తాకట్టు పెట్టి రూ.42 వేల రూపాయలను ముడి పదార్థాల కోసం సప్లయర్ కు ఇచ్చింది.అయితే డబ్బులు తీసుకున్న సప్లయర్ ముడి సరుకులను పంపించలేదు.

ఈ విషయం భర్తకు తెలిస్తే కోప్పడతారని ఫరిదా బేగం దాచి పెట్టింది.

Telugu Farida Begum, Gold Theft, Hyderabad, Jahoor Hussian, Mir Chowk, Loan App,

ఫరీదా బేగం ఆన్లైన్ యాప్ లో( Online Loan App ) భర్తకు తెలియకుండా అప్పు చేసింది.ఆ అప్పు చేసిన డబ్బుల నుంచి రూ.35 వేలను ఇంటి మరమత్తుల కోసం ఖర్చు చేసింది.అయితే ఆన్లైన్ యాప్ లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు ఫరీదా బేగం ను ఒత్తిడికి గురి చేశారు.దీంతో ఏం చేయాలో తెలియక ఫరీదా బేగం తన అత్తకు చెందిన 56 తులాల బంగారాన్ని దొంగతనం చేసింది.

దొంగలించిన బంగారు ఆభరణాలను తన సోదరి ఫర్హీన్ బేగం, సోదరి భర్త మహమ్మద్ సమీర్ తో కలిసి విక్రయించాలి అనుకుంది.ఇంట్లో నగలు కనిపించకపోవడంతో ఫరీదా బేగం భర్త హుస్సేన్ మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఫరీదా బేగం ను విచారించగా ఆమె దొంగతనం చేసినట్లు నిర్ధారించారు.ఫరీదా బేగంతో పాటు మహమ్మద్ సమీర్, ఫర్జీన్ బేగంలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 56 తులాల బంగారాన్ని రికవరీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube