సలార్.సలార్.సలార్.ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ ( Salaar ) మేనియానే కనిపిస్తోంది.ప్రభాస్ సినిమా హిట్ అయితే ఎప్పుడెప్పుడు కాలర్ ఎగరేవేసుకొని తిరుగుదామా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా తలెత్తుకునేలా చేసింది.మరీ ముఖ్యంగా ఈయన బాహుబలి తర్వాత చేసిన మూడు సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవడంతో సలార్ సినిమా పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.
ఇక అందరూ ఆశలకు తగ్గట్టుగానే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఇక ఇందులో ప్రభాస్ ( Prabhas ) కి ఎక్కువగా డైలాగులు లేకపోయినప్పటికీ ఆయన కటౌట్ తోనే అందర్నీ మెప్పించారు.
ఆయన కటౌట్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇదంతా పక్కన పెడితే సలార్ సినిమాలోని ఒక కుర్రవాడు గురించి ప్రస్తుతం నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
అయితే ఏ సినిమా విడుదలైనా సరే ఆ సినిమాలో కొత్త వారి గురించి అలాగే వారి నటనతో మెప్పించిన వారి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది.అలాగే వారి బయోడేటా ఏంటి వాళ్ళు ఎవరు అని తెలుసుకునే పనిలో పడతారు నెటిజన్స్.
అయితే తాజాగా విడుదలైన సలార్ సినిమాలో పృథ్విరాజ్ ( Prithviraj ) చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడి నటనకు చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఆ కుర్రాడు కూడా మన తెలుగు హీరో కొడుకు అని తెలుస్తోంది.విషయంలోకి వెళ్తే.విలన్ పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన అబ్బాయి పేరు కార్తికేయ దేవ్.ఈయన టాలీవుడ్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని తెలుస్తోంది అంటే వరసకి రవితేజ ( Raviteja ) కి కూడా కొడుకే అవుతాడు.
ప్రస్తుతం కార్తికేయ దేవ్ ( Karthikeya dev ) పదవ తరగతి చదువుతున్నాడట.ఇక ఈ సినిమాలోని పృథ్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసి చివరికి కార్తికేయ దేవ్ ని తీసుకున్నారట ప్రశాంత్ నీల్.ఇక సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసి 15 రోజుల్లో ఈయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేశారని కార్తికేయ దేవ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.