ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు( Founders of Infosys ) ఎక్కువ గంటలు పని చేయాలని చెప్పి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.తాజాగా మరొక వ్యాపారవేత్త విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ తో పాటు ఎక్కువ గంటలు పనిచేయాల్సిందే అని కామెంట్లు చేశారు.
మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో( Boston, Massachusetts ) ఉన్న ఈ-కామర్స్ కంపెనీ వేఫేర్ సీఈఓ అయిన నీరాజ్ షా( Neeraj Shah ) తన ఉద్యోగులను కష్టపడి పని చేయాలని, లైఫ్ లో వర్క్ మిళితం చేయాలని కోరారు.తన ఉద్యోగులకు రాసిన నోట్‌లో, “గెలుపు కోసం కష్టపడి పనిచేయడం అవసరం, ప్రతి ఒక్కరూ ఎక్కువ గంటలు పని చేయాలి.పని, జీవితాన్ని మిళితం చేయడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు.సోమరితనంతో విజయం సాధించిన దాఖలాలు చరిత్రలో లేవు.” అని అన్నారు.
డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే దాని గురించి కూడా షా కొన్ని అవగాహనలను పంచుకున్నారు.ధరలను చర్చించాలని ఉద్యోగులను కోరారు.దేనికోసం డబ్బు ఖర్చు చేస్తారు? ఒకదానికోసం అంత డబ్బు ఖర్చు చేయడం ఓకేనా? అని అతను ఉద్యోగులను అడిగారు.ప్రజలు ఆన్‌లైన్ స్టోర్ కంపెనీ నుంచి ఫర్నిచర్, గృహోపకరణాలను కొనుగోలు చేయడంతో వేఫెయిర్ కరోనా కాలంలో మంచి వ్యాపారాన్ని చూసింది.అయితే, 2022లో వేఫెయిర్ తన శ్రామికశక్తిలో 5% మందిని తగ్గించుకున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి, షా ప్రకారం, కంపెనీ తిరిగి లాభాలను ఆర్జించింది.షా కంపెనీ విజయాన్ని పురస్కరించుకుని, మరిన్ని విజయాలు సాధించేందుకు కలిసి పని చేయాలని తన ఉద్యోగులను ప్రోత్సహించారు.“మనమందరం కలిసి ఈ దిశలో పయనిస్తే ఇప్పుడు గెలుస్తున్న దానికంటే చాలా వేగంగా గెలుస్తామ”ని అన్నారు.