తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఒక కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిందని తెలిపారు.
కేసీఆర్ నియంతలా పాలన చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు.
గతంలో ఇచ్చిన హామీలను సైతం బీఆర్ఎస్ అమలు చేయలేదని ధ్వజమెత్తారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పాలించాలని తెలిపారు.
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.ఇదేమన్న వారసత్వ రాజకీయమా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల భవిష్యత్ ను ఎలా నిర్ణయిస్తున్నారని నిలదీశారు.