కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది.. కార్తిక మాసంలో ముఖ్యమైన రోజులు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం( Kartikamasam ) మొదలవుతుంది.కానీ ఈ సంవత్సరం దీపావళి మరుసటి రోజు కాకుండా రెండవ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుందని పండితులు చెబుతున్నారు.

 When Does The Month Of Kartika Start These Are The Important Days In The Month O-TeluguStop.com

సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన అని చెబుతున్నారు.ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మ ముహూర్తంలోనే( Brahma Muhurtam ) కాబట్టి నవంబర్ 12 వ తేదీన దీపావళి మరుసటి రోజు అంటే నవంబర్ 13వ తేదీ సోమవారం సూర్యోదయానికి అమావాస్య ( amavasya )ఉంటుంది.

అందుకే నవంబర్ 14 మంగళవారం రోజు సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం మొదలవుతుంది.

Telugu Bhakti, Brahma Muhurtam, Devotional, Kartika, Kartikamasam, Nagula Chavit

ఇంకా చెప్పాలంటే 2023 నవంబర్ 14వ తేదీన మంగళవారం కార్తీక మాసం మొదలవుతుంది.అలాగే నవంబర్ 15వ తేదీన బుధవారం యమవిదియ భగినీహస్త భోజనం, నవంబర్ 17వ తేదీన శుక్రవారం రోజు నాగుల చవితి,నవంబర్ 25న కార్తీకమాసం మొదటి సోమవారం, నవంబర్ 22 యజ్ఞ వల్క జయంతి, నవంబర్ 23వ తేదీన మతత్రయ ఏకాదశి,నవంబర్ 24వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి, 26వ తేదీన ఆదివారం రోజు జ్వాలా తోరణం, నవంబర్ 27వ తేదీన కార్తీక మాసం రెండవ సోమవారం, కార్తీక పూర్ణిమడిసెంబర్ 4వ తేదీన కార్తీక మాసం మూడవ సోమవారం, డిసెంబర్ 11వ తేదీన కార్తీకమాసం నాలుగో సోమవారం,డిసెంబర్ 13వ తేదీన పోలి స్వర్గం ఉంటాయి.

Telugu Bhakti, Brahma Muhurtam, Devotional, Kartika, Kartikamasam, Nagula Chavit

కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్ఠలతో ఉంటారు.కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి.చలి గాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెటర్లు, దుప్పట్లు,కంబళ్లు దానం చేస్తే శివ కేశవుల( Shiva Kesavula ) అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

దానధర్మాలు గోప్యంగా చేసిన వారికి ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో ఇలాంటి పనులను అస్సలు చేయకూడదు.ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారం కి దూరంగా ఉండాలి.కనీసం ఒక నెల రోజుల పాటు ఓ నియమంతో పాటిస్తే పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు అస్సలు రావు.

విశ్వాసం ఉంటే దేవుడిని పూజించాలి.లేదంటే మానేయాలి.

దైవదూషణ మాత్రం అస్సలు చేయకూడదు.దీపారాధనకు తప్ప నువ్వులు నూనె ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.

మినుములు తినకూడదు.నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు.

కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube