ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ చర్చలు..!

CS Talks With AP JAC Amaravati Leaders..!

ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి సమావేశం అయ్యారు.గత కొన్ని రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

 Cs Talks With Ap Jac Amaravati Leaders..!-TeluguStop.com

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు సీఎస్.

కాగా రాష్ట్రంలో మూడో దశ ఉద్యమం కొనసాగుతుంది.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక , కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 85 రోజులుగా ఉద్యమాన్ని చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీఎస్ కు ఫిబ్రవరిలో 50 పేజీల మెమరాండంను జేఏసీ నేతలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో మెమరాండంలోని అంశాలు, శాఖా పరమైన డిమాండ్లపై సీఎస్ చర్చిస్తున్నారని సమాచారం.

Video : CS Talks With AP JAC Amaravati Leaders! #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube