కాకి ఫార్ములాతో హిట్ అవుతున్న తెలుగు సినిమాలు.. ఇదేం విచిత్రమో అంటూ?

కరోనా థర్డ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.అన్ని సినిమాలు కాకపోయినా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం.

 Crow Sentiment For Tollywood Movies Details Here Goes Viral In Social Media , Cr-TeluguStop.com

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై కొన్ని సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించాయి.ఆ జాబితాలో బలగం, విరూపాక్ష( Balagam ) సినిమాలు ముందువరసలో ఉంటాయి.

ఈ రెండు సినిమాలు నిర్మాతలకు సైతం కాసులవర్షం కురిపిస్తున్నాయి.అయితే ఈ రెండు సినిమాలు కాకి ఫార్ములాతో హిట్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బలగం సినిమాలో కాకి ప్రధానంగా కథ నడవగా విరూపాక్ష( Virupaksha )లో కొన్ని సన్నివేశాల్లో కాకి కీలక పాత్ర పోషించింది.రాబోయే రోజుల్లో సినిమాలలో కాకి ఫార్ములాకు ప్రాధాన్యత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

ఈ సినిమాల దర్శకులకు కూడా ఈ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.బలగం సినిమా సక్సెస్ తో కమెడియన్ వేణుకు మంచి ఆఫర్లు వస్తుండగా విరూపాక్ష డైరెక్టర్ కార్మీక్ వర్మ దండు( Karthik Varma Dandu )కు ఈ సినిమా సెకండ్ మూవీ కావడం గమనార్హం.సుకుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వల్లే ఈ సినిమా రేంజ్ మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.విరూపాక్ష మూవీ రెండో రోజు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

సాయితేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలతో పోల్చి చూస్తే విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.విరూపాక్ష మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుండటం గమనార్హం.విరూపాక్ష ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించే ఛాన్స్ ఉంది. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube