సినిమాల ప్రభావం మనిషి జీవితం మీద ఎంతో ఉంటుంది.మూడు గంటల సినిమాలు 30 ఏండ్ల వరకు గుర్తుండేవి ఎన్నో ఉన్నాయి.
ఆయా సినిమాల్లోని కొన్ని డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేం.అలాంటి కొన్ని ఆల్ టైం హిట్ డైలాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
కేజీఎఫ్:

ఈసినిమాలోని ప్రతి సీన్ తో పాటు డైలాగ్ అద్బుతం.అందులో ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు అని హీరో నోటి వచ్చే ఈ మాట అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.తల్లి గురించి ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరు అనిపిస్తుంది.
గబ్బర్ సింగ్:

పవన్ కల్యాణ్ సినిమాల్లో మంచి పంచ్ డైలాగులు ఉంటాయి.ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అంటూ చెప్పిన డైలాగ్ జనాల నోళ్లలో నానిపోయింది.
పోకిరి:

మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో డైలాగులు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి.అందులో ప్రధానంగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.
మగధీర:

రాజమౌళి తెరకెక్కించి ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో యుద్ధ సమయంలో రాం చరణ్ చెప్పే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.వందమందిని ఒకేసారి పంపించు.అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
ఇంద్ర:

చిరంజీవి నటించి ఈ సినిమాలోనూ మంచి డైలాగులున్నాయి.అందులో వీర శంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.అంటూ చిరంజీవి నోటి వెంట వచ్చే ఈ డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించింది.
సింహా:

బాలయ్య డైలాగులంటే ప్రేక్షకులకు ఎంతో పండగ.ఆయన నటించిన సింహా సినిమాలో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు.అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది.
నరసింహ నాయుడు:

బాలయ్య ఈ సినిమాలలో డైలాగులతో చంపేస్తాడు. కత్తులతో కాదు , కంటి చూపుతో చంపేస్తా అంటూ 20 ఏండ్ల క్రితం చెప్పిన ఈ డైలాగ్ పవర్ ఇప్పటికీ తగ్గలేదు.
బొమ్మరిల్లు:

ఫీల్ గుడ్ మూవీ బొమ్మరిల్లులోనూ మంచి డైలాగులు అదరినీ ఆకట్టుకున్నాయి.ఇంకేం కావాలి.వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.అనే మాట తెలుగు ప్రజల రింగ్ టోనుగా మారిపోయింది.
బాహుబలి:

ఈ సినిమాలలోనూ పలు డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలే మామా.అనే మాట తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోతుంది.
భాషా:

ఈయన సినిమాల్లోనూ ఎన్నో డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి.వాటిలో భాషా సినిమాలో చెప్పిన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు.అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది.