అర‌టి పండ్లు కూలీ త‌ల‌మీద ప‌డ్డందుకు రూ.4కోట్ల ప‌రిహారం చెల్లించాల‌న్న కోర్టు

మ‌నం రోజూ ఎన్నో ర‌కాల వార్త‌లు వింటూనే ఉంటాం.అయితే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయే వార్త విన‌డానికే కాదు ఊహించ‌డానికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

 Court To Pay Rs 4 Crore Compensation For Bananas Falling On Laborer Head, Banana-TeluguStop.com

సోష‌ల్ మీడియా అంటేనే ఇలాంటి విచిత్ర‌మైన వార్త‌ల‌కు నెల‌వు క‌దా.అందుకే దీన్ని చాలా ఫాస్ట్‌గా వైర‌ల్ చేసేస్తున్నారు నెటిజ‌న్లు.

ఇక‌పోతే మ‌నం ప‌రిహారం అనే విష‌యం మాట్లాడుకుంటే ఇది ఏదైనా ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ప్పుడు స‌ద‌రు కార‌కులు బాధితుల‌కు చెల్లించేది.అయితే దీనికి కూడా కొన్ని నిబంద‌న‌లు ఉంటాయి క‌దా.

ఏదైనా పెద్ద ప్ర‌మాదం జ‌రిగి పెద్దగా ప్రాణ న‌ష్ట‌మో లేదంటే ఆస్తి న‌ష్ట‌మో జ‌రిగితేనే దీన్ని చెల్లించాల‌నే రూల్స్ ఉంటాయి.

అయితే ఇప్పుడు ఓ ఫ‌న్నీ వార్త అది కూడా ప‌రిహారానికి సంబంధించిందే మ‌నం తెలుసుకోబోయేది.

ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్‌ల్యాండ్ సిటీలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.అయితే 2016వ సంవత్సరంలో ఓ ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ క్వీన్‌ల్యాండ్ ప‌ట్ట‌ణంలో నివ‌సించే ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు సంబంధించిన ఓ అరటి తోట ఉంది.ఈయ‌న తోట‌లో చాలా కాలంగా లాంగ్‌బాటమ్ అనే కూలీ ప‌నిచేస్తున్నాడు.

ఓ రోజు ఈ కూలీ తోట‌లో త‌న ప‌ని తాను చేస్తుండగా.అనుకోకుండా అరిటి పండ్లతో నిండి ఉన్న ట్రే త‌ల‌మీద ప‌డ‌టంతో అత‌ను గాయ‌ప‌డ్డాడు.

Telugu Fine, Australia, Banana Tray, Bananas Laborer, Queensland-Latest News - T

ఎంత‌లా అంటే ఆ దెబ్బ‌కు ఆ కూలీ వికలాంగుడిలా మారాల్సి వచ్చిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.ఇక విక‌లాంగుడు కావ‌డంతో అత‌ను పనిలేక దీన స్థితికి వ‌చ్చాడు.దీంతో త‌న‌కు ఎలాగైనా 502,740 డాలర్ల ప‌రిహారం కావాలంటూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.ఈ కేసు మీద అప్ప‌టి నుంచి విచారిస్తున్న కోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.ట్రే మీద పడి ఆ కూలీ జీవితాంతం విక‌లాంగుడిగా మారాల్సి వ‌చ్చిది కాబ‌ట్టి అత‌నికి ప‌రిహారంగా దాదాపు రూ.3,77,15,630 చెల్లించాల్సిందేనంటూ తీర్పు ప్ర‌క‌టించింది.దీంతో ఆ అరటి తోట యజమాని త‌లు ప‌ట్టుకుంటున్నాడు.త‌న త‌ప్పు లేక‌పోయినా ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన దానికి త‌న‌కు ఇంత పెద్ద ఫైన్ వేయ‌డ‌మేంట‌ని వాపోతున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube