ప్రధాన తీగజాతి కూరగాయలలో సొరకాయ పంట( bottle gourd crop ) కూడా ఒకటి.సొరకాయ పంట నాటుకునే విధానాన్ని బట్టి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా తీగజాతి కూరగాయలను పైపందిరి, అడ్డుపందిరి, బోదెల పద్ధతి ద్వారా సాగు చేస్తారు.కాకపోతే పై పందిరి విధానంలో సాగు చేయడం వల్ల పెట్టుబడి వ్యయం కాస్త తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చు.
ఈ సొరకాయ సాగుకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు( Black soils, red soils ) , నీరు ఇంకే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.లవణ శాతం ఎక్కువగా ఉండే నేలలు, నీరు ఇంకా కుండా ఉండే నేలలు సాగుకు పనికిరావు.
వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకొని, ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించి ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు ( Cattle manure )వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.
సొరకాయ పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద( Pests ) తక్కువగా ఉండాలంటే సొరకాయ సాగు పై పందిరి పద్ధతిలో చేయాలి.ఇలా చేస్తే పంటకు ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే సకాలంలో గుర్తించే అవకాశం ఉంటుంది.ఇక సొరకాయ పంట తీగజాతి పంట కాబట్టి మొక్కల మధ్య దూరం కనీసం మూడు అడుగులు, మొక్కల వరుసల మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండేటట్లు విత్తుకోవాలి.
ఒక ఎకరాకు 600 గ్రాముల విత్తనాలు అవసరం.విత్తనాలను విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం తక్కువ.
సోర పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ.పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటి తడులు అందించాలి.నీటిని డ్రిప్ విధానం ద్వారా అందిస్తే దాదాపుగా కలుపు సమస్య ఉండదు.ఇక సుర పంట కాలం 130 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది.పంట వేసిన 50వ రోజు నుండి దిగుబడి రావడం మొదలవుతుంది.కాయ బరువు సుమారుగా 800 గ్రాములు దాటిన తర్వాత పంట కోత చేయాలి.