జగన్ ని ఫాలో అవుతున్న ట్రంప్...రీజన్ ఇదేనా..??

అమెరికాలో కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉండే రోజు వెలువడే కరోనా కేసుల సంఖ్య చెప్పకనే చెబుతుంది.కరోనా మహమ్మారి ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అమెరికాలో 30 లక్షలకి చేరువలో ఉండటంతో భవిష్యత్తులో మృతుల సంఖ్య తీవ్రతరం అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.

 America President Donald Trump Follow The Ap Cm Jagan Mohan Reddy About Living W-TeluguStop.com

ఇదిలాఉంటే ఏపీ ముఖ్య మంత్రి మొట్ట మొదటి సారిగా కరోనా తో మనం కలిసి బ్రతకాల్సిందే.అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఓ మీడియా సమావేశంలో హెచ్చరించారు.

ఈ క్రమంలోనే అందరూ హేళన చేసినా ప్రస్తుతం అన్ని దేశాలు కరోనాతో సహజీవనం తప్పదని ఫిక్స్ అయిపోయాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నారు.

ఇప్పట్లో మనం కరోనాని వదిలించుకునే పరిస్థితులు కనపడంటం లేదు ఇక మనం కరోనా తో కలిసి బ్రతకాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పలు దేశాల నేతలు ఈ విషయాన్నీ ఎప్పుడో ధ్రువీకరించారు.

కానీ ట్రంప్ కి కాస్త ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది.ప్రజలు కరోనాతో సహజీవనం చేయాలనీ ప్రచారం మొదలు పెట్టారు.

Telugu America, Apcm, Coronavirus, Donald Trump, White-

కరోనాతో సహజీవనం ఎలా చేయాలి.ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కోసం ఆలోచనలు చేస్తున్నాయి వైట్ హౌస్ వర్గాలు.నవంబర్ లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై చూపుతుందని భయపడిన ట్రంప్ వర్గం ఇప్పుడు కరోనా ఉన్నా ప్రజలు ఎలా బ్రతకాలి అనే విషయాలపై ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.ఈ క్రమంలోనే ట్రంప్ కరోనాతో సహజీవనం ని తెరపైకి తీసుకువచ్చాడని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube