ఫారిన్ చదువులు మాకొద్దు బాబోయ్..!!!

విదేశీ విద్య ఇది భారతీయ విద్యార్ధులలో చాలామంది కల.విదేశాలలో ఉన్నత విద్యని అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉండాలని.

 Indian Student Mobility Report 2020, Corona Effect,foreign Study, Corona Effect-TeluguStop.com

ఆర్ధికంగా స్థిరపడాలని ఎన్నో ఆలోచనలతో ఆశలతో భారత విద్యార్ధులు విదేశాలు వెళ్తారు.కానీ కరోనా ప్రస్తుత పరిస్థితితులని పూర్తిగా మార్చేసింది.

ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఇప్పుడు విదేశీ విద్య పేరు చెప్తేనే భయంతో వణికిపోతున్నారు.ప్రస్తుతం వివిధ దేశాలలో చదువుకుంటున్న విద్యార్ధులు కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్తున్నారో ప్రత్యక్షంగా చూసిన వారి ఆలోచనలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని తెలుస్తోంది.


లండన్ కి చెందిన క్వాక్ క్వరల్లీ సైమండ్స్ అనే సంస్థ తాజా అధ్యయనం ప్రకారం విదేశీ విద్యపై భారతీయ విద్యార్ధుల ప్రస్తుత మనోభావాలని వెల్లడించింది.బ్రతికుంటే బలుసాకు అయినా తినచ్చు కానీ తమ దేశం విడిచి చదువుల నిమ్మిత్తం వెళ్ళే ఆలోచనే లేదని తేల్చి చెప్తున్నారట.

కరోనా ప్రభావం చూపక ముందు విదేశీ విద్యపై ఆసక్తి చూపించిన విద్యార్ధులలో దాదాపు 49 శాతం మంది ఇప్పుడు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారట.


Telugu Corona Effect, Foreign, Indian Mobility-

ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2020 పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన ఈ సర్వేని తాజాగా విడుదల చేసింది.ఇప్పట్లో విదేశాలలో ఉపాది అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు లేవని.తాము అక్కడ చదువుకున్నా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదని అభిప్రాయాన్ని వెల్లడించారట.

ఇదిలాఉంటే ఉన్నత విద్యాలయాలు ఈ లెర్నింగ్ విధానంపై దృష్టి పెట్టింది.ఈ విధానంలో కొన్ని మార్పులు వస్తే తప్పకుండా విద్యార్ధులని ఆకట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube