సింగర్ మంగ్లీ పాట పై వివాదం... మరోసారి చిక్కుల్లో పడ్డ స్టార్ సింగర్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లేబాక్స్ సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె కెరియర్ మొదట్లో పలు యూట్యూబ్ వీడియోలు చేస్తూ జానపద పాటలు పాడుతూ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే తనకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తన పాటలను ఆదరించడంతో ఈమెకు ఏకంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

 Controversy Over Singer Mangli's Song Star Singer In Trouble Once Again ,singer-TeluguStop.com

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతున్నటువంటి మంగ్లీ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈమె ప్రతి ఏడాది బోనాలు సంక్రాంతి శివరాత్రి వంటి పండుగలను పురస్కరించుకొని పాడే పాటలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.

Telugu Mangli-Movie

ఈ క్రమంలోనే ఈ ఏడాది శివరాత్రి పండుగను పురస్కరించుకొని మంగ్లీ ఒక పాటను చేసింది.అయితే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా మంగ్లీ పాడుతూ షూట్ చేసినటువంటి వీడియోని విడుదల చేశారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంగ్లీ వివాదంలో చిక్కుకుంది.గతంలో ఓసారి బోనాలు పాటను పాడుతూ అమ్మవారిని అవమానించారంటూ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈమె శివరాత్రి పండుగ సందర్భంగా పాడిన పాట ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు.

Telugu Mangli-Movie

సాధారణంగా శ్రీకాళహస్తీశ్వర కాలభైరవ స్వామి ఆలయ గర్భగుడిలో ఎవరికి ప్రవేశం ఉండదు అలాంటిది మంగ్లీ పాడిన ఈ పాటను గుడి లోపల చిత్రీకరించారు.అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటూ పలువురు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాళహస్తీశ్వరాలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద నృత్యం చేసిన విజువల్స్ ఆ పాటలో ఉన్నాయి.

ఇలా ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటపాటలు ఇప్పుడు తనని వివాదంలోకి నెట్టివేశాయి.గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించి యూట్యూబ్ లో విడుదల చేయడం మీద స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

గత రెండు దశాబ్దాలుగా ఎవరికి ఇక్కడ షూటింగ్ చేయడానికి అనుమతి తెలుపలేదు.అలాంటిది మంగ్లీ ఎలా షూట్ చేశారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు దీంతో ఈమె కాస్త వివాదంలో చిక్కుకుంది.

మరి ఈ విషయంపై మంగ్లీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube