విజయభేరి మోగిస్తామంటున్న కాంగ్రెస్!

దాదాపు 25 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కాంగ్రెస్ సి డబ్ల్యూ సి సమావేశాలకు( Congress CWC Meeting ) వేదికగా మారింది .తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ సమావేశాలకు హైదరాబాద్ కేంద్రం గా కాంగ్రెస్ సమర శంఖాన్ని పూరించబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Congress Targets Telangana With Cwc Meetings Details, Congress , Telangana ,cwc-TeluguStop.com

కాంగ్రెస్ అధినాయకత్వమంతా హైదరాబాద్కు తరలిరానున్నట్లుగా తెలుస్తుంది .కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ,( Sonia Gandhi ) రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, ఇలా కాంగ్రెస్ దిగ్గజాలంతా హైదరాబాదుకు క్యూ కడుతున్నారు.దక్షిణాది రాష్ట్రాలను ఒకప్పుడు తన కంచుకోటగా మార్చుకుని ఏలిన కాంగ్రెస్ తరువాత అనేక పరిణామాల మధ్య పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు మరియు ప్రాంతీయ పార్టీలు బలపడడంతో తన ఉనికిని కోల్పోయింది.అయితే మరోసారి దక్షిణాది రాష్ట్రాలలో తన పట్టు నిలుపుకోవాలని పూర్వ వైభవం సాదించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా కర్ణాటకను గెలుచుకోగలిగింది.

Telugu Congress, Cwc, Hyderabad, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Tela

తన తదుపరి లక్ష్యంగా తెలంగాణను ఎంచుకున్న కాంగ్రెస్ తన మంది మార్బలాన్ని మొత్తం తెలంగాణలో మోహరిస్తుంది.రెండు రోజులు జరిగే ఈ సమావేశాలలో మొదటి రోజు పూర్తిస్థాయి పార్టీ అంతర్గత సమావేశం జరుగుతుందని తాజ్ కృష్ణలో మొత్తం సిడబ్ల్యుసి సభ్యులు, సిఎల్పీ నాయకులు ,పిసిసి అధ్యక్షులు పాల్గొంటారని రేపు అనగా 17వ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని సోనియా గాంధీ పూరిస్తారని తెలుస్తుంది.ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను( Assembly Elections ) ప్రభావితం చేసే ఆరు హామీలను సోనియా గాంధీ ప్రత్యేకంగా సభలో ప్రకటిస్తారని తెలుస్తుంది .కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల లోపు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించ బోతున్నట్టుగా తెలుస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రథమ లక్ష్యంగా ఎంచుకున్న కాంగ్రెస్ ఈ గెలుపుతో మిగతా రాష్ట్రాల్లో ప్రభావం చూపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ

Telugu Congress, Cwc, Hyderabad, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Tela

ఈసారి తెలంగాణ( Telangana ) తమ “చెయ్యి “ జారకూడదన్న పట్టుదలలో కాంగ్రెస్ ఉంది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు తెలంగాణలో గుర్తింపు ఉందని భావిస్తున్న కాంగ్రెస్( Congress Party ) ఈసారి ఎలాగైనా తమకు అధికారం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు స్పెషల్ రిక్వెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా కలిసి రావడంతో తమ ప్రభుత్వ హయాములోనే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని, రజకారుల ఆగడాలతో ఆగమైన తెలంగాణను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్కు మాత్రమే ఉందని మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయనున్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి సి డబ్ల్యూ సి సమావేశాలు జరగడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.

దాదాపు పది లక్షల మంది సభకు తరలి రానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube