జమిలి ఎలక్షన్స్.. కే‌సి‌ఆర్ కు లాభమేనా ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్( Jamili Elections ) పై రసవత్తరమైన చర్చ జరుగుతోంది.ఎలక్షన్స్ కు అయ్యే ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ నినాదంతో జమిలి ఎన్నికలవైపు అడుగులు వేస్తోంది.

 Jamili Elections.. Is It Profitable For Kcr , Cm Kcr , Brs Party ,jamili Ele-TeluguStop.com

ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం అన్నీ కసరత్తులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఈ నెల 17 న జరగనున్న అత్యవసర పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎలక్షన్స్ పై బిల్ ప్రవేశ పెట్టె అవకాశం ఉంది.

ఒకవేళ బిల్లు అమలైతే జమిలి ఎలక్షన్స్ అనివార్యంగా మారతాయి.దాంతో ఈ ఏడాది జరగనున్న తెలంగాణ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Jamili-Politics

అయితే తెలంగాణలో ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించారు కే‌సి‌ఆర్.( CM kcr ) అందువల్ల మళ్ళీ ఎన్నికలు వాయిదా పడితే బి‌ఆర్‌ఎస్ కు ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.ఈ నేపథ్యంలో జమిలి ఎలక్షన్స్ కు వ్యతిరేకంగా కే‌సి‌ఆర్ ముందుకు సాగుతారనే గుసగుసలు కూడా వినిపించాయి.అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము కూడా సిద్దమే అని కే‌సి‌ఆర్‌ .

( CM kcr ) అండ్ కొ చెబుతోంది.అంతే జమిలి ఎలక్షన్స్ కు కే‌సి‌ఆర్ కూడా రెడీ అంటున్నట్టే.

అయితే జమిలి ఎలక్షన్స్ కారణంగా తెలంగాణ ఎన్నికలు వాయిదా పడితే.ఇప్పటికే సీట్లు దక్కని కొందరు పార్టీ వీడుతున్నారు.

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Jamili-Politics

మళ్ళీ ఎన్నికలు వాయిదా పడితే అసంతృప్త వాదులు బారిగా పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కొందరి విశ్లేషకుల వాదన.అయితే ఇప్పుడు ప్రకటించిన సీట్లలో అభ్యర్థుల మార్పు ఖచ్చితంగా ఉంటుందని ప్రకటన రోజే క్లారిటీ ఇచ్చారు కే‌సి‌ఆర్.దీంతో ఎలక్షన్స్ వాయిదా పడితే మళ్ళీ ఆ టైమ్ లో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలోను సీట్ల కేటాయింపులోనూ మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.ఇకపోతే జమిలి ఎలక్షన్స్( Jamili Elections )వల్ల బి‌ఆర్‌ఎస్ కు లాభమే అని కే‌సి‌ఆర్ .

( CM kcr ) భావిస్తున్నారట.ఎందుకంటే ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉన్న ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బి‌ఆర్‌ఎస్( BRS ) కే పట్టం కడతారనేది గులాబీ బాస్ ధీమాగా తెలుస్తోంది.

అందుకే జమిలి ఎలక్షన్స్ కు కూడా కే‌సి‌ఆర్ రెడీగా ఉన్నారని టాక్.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube