మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన సీఎం జగన్..!!

కొత్త పార్లమెంట్ భవనం( New Parliament Building )లో నేడు జరిగిన సమావేశంలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.“నారీ శక్తి వందన్ అధినియం”( Nari Shakti Vandan Adhiniyam ) పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ బి ల్లుపై పార్లమెంటులో వాడి వేడి వాదనలు జరుగుతూ ఉన్నాయి.ఈ బిల్లుతో పార్లమెంటు మరియు అసెంబ్లీలలో 33 శాతం మహిళలకు చోటు దక్కనుంది.అయితే ఈ బిల్లు ప్రవేశ పెట్టడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

 Cm Jagan's Response To The Women's Reservation Bill, Cm Jagan, Nari Shakti Vanda-TeluguStop.com

మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill ) కు వైసీపీ మద్దతు ప్రకటించటం పై తనకెంతో గర్వకారణంగా ఉందని ట్వీట్ చేశారు.ఇదే సమయంలో మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యం.

ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు సంవత్సరాల లో ప్రవేశపెట్టిన పథకాలు ఇంకా వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా.సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించటం ద్వారా కూడా దీనిని సాధించాం.

కలిసికట్టుగా ఇంకా ప్రకాశవంతమైన మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం అని.ట్విట్టర్ లో సీఎం జగన్( CM YS Jagan ) పోస్ట్ పెట్టడం జరిగింది.ఇదిలా ఉంటే నిన్ననే కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లును ఆమోదించింది.ప్రస్తుతం పార్లమెంట్ ఇంక రాజ్యసభలలో ఈ బిల్లు పై జరుగుతున్న వాదనలు జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube