ఈనెల 27వ తేదీన సీఎం జగన్ ( cm jagan )సభను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.తగరపువలస వేదికగా సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
వైసీపీ( YCP ) పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే చేసిన పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు.నియోజకవర్గంలో ఒకరికే టికెట్ వస్తుందన్న మంత్రి బొత్స పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత మనం కట్టుబడి పని చేయాలని సూచించారు.రాష్ట్రంలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
అయితే వైసీపీలో పార్టీ అధినేత, సీఎం జగన్ కీలక మార్పులు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.