బాబు బాగా బిజీ ... ఇంటిపోరుతో గజిబిజి !  

  • టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కొత్త కొత్త ఎత్తులు వేస్తూ… పక్క పార్టీలను ముప్పు తిప్పలు పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే …. పక్క పార్టీల మేనిఫెస్టోలను సైతం కాపీ కొట్టి మరీ ఇప్పటి నుంచి వాటిని అమలు చేస్తూ…. ప్రతిపక్ష పార్టీలకు జలక్ ఇస్తున్నాడు.

  • Chandrababu Naidu So Tense About Party Leaders-Party Jumpings In Tdp Pawan Kalyan Janasena Tdp Ycp Ys Jagan

    Chandrababu Naidu So Tense About Party Leaders

  • చంద్రబాబు చేస్తున్న పని విమర్శలు పాలవుతున్నా… ప్రజల్లో మాత్రం టీడీపీకి మైలేజ్ పెరిగిందనేది వాస్తవం. అయితే చంద్రబాబుకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సొంత పార్టీ నుంచి నాయకుల బెదిరింపులు అలకలు… అవినీతి, ప్రజా వ్యతిరేకత, ఈ విధంగా అన్ని రకాలుగా బాబు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక వైపు చూస్తే ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. మరోవైపు సొంత పార్టీలోనే ఇంటి పోరు మొదలవడంతో ఏం చేయాలో తెలియక అసహనంతో రగిలిపోతున్నాడు.

  • గత నాలుగు సంవత్సరాల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న నాయకుల అసమ్మతి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరింత పెరిగింది. చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అంతా… గొంతు పెంచి మరి తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. దీంతో సొంత పార్టీలో అసమ్మతిని పూర్తిగా తొలగించలేక ప్రతిపక్ష పార్టీలు నుంచి వచ్చి ఎదురు దాడిని తట్టుకోలేక సతమతమవుతున్నాడు. నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా… ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదు. గత నాలుగున్నర ఏళ్లలో తన నియోజకవర్గంలో తమ వ్యక్తిగత సమస్యల పై బాబు ముందు వినయ విధేయతలు ప్రదర్శించిన నాయకులు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

  • Chandrababu Naidu So Tense About Party Leaders-Party Jumpings In Tdp Pawan Kalyan Janasena Tdp Ycp Ys Jagan
  • నాయకుల మధ్య అంతకంతకు పెరిగిన ఇగో ప్రాబ్లెమ్ కారణంగా ఒక్కొక్కరూ పార్టీకి దూరం దూరంగా జరుగుతున్న. ఇప్పటికే మేడా మల్లికార్జునరెడ్డి, రావెల కిశోర్ లాంటి వారు పార్టీని వీడగా… ఆమంచి కృష్ణ మోహన్, తోట త్రిమూర్తులు వంటి వారు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. దీంతో బాబు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు … అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో పడ్డారు. ఒకపక్క మిగతా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు తాను నిరంతరం కష్టపడుతుంటే… సొంత పార్టీ నేతలే ఇలా అసంతృప్తి రాగం వినిపిస్తే ఎలా అంటూ… తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.