టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది.
చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విధానం సరిగా లేదని, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది .వైసిపి మినహా అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ చంద్రబాబు అరెస్టు వ్యవహారం పైనే తిరుగుతున్నాయి.చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ నందమూరి కుటుంబం లోని కొంతమంది మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మాట్లాడగా, మరి కొంతమంది మీడియా, సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ( Jr ntr )స్పందించకపోవడంపై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తూ , ఆయన అసలు బతికే ఉన్నాడా అంటూ ప్రశ్నించడం వివాదాస్పదంగా మారింది.మాజీమంత్రి , టిడిపి కీలక నేత పత్తిపాటి పుల్లారావు ( Prathipati Pullarao )జూనియర్ ఎన్టీఆర్ బతికే ఉన్నాడా అంటూ ప్రశ్నించడం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.చంద్రబాబు తప్పులు చేసి జైలుకు వెళితే జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తిడుతున్నారు అని, జూనియర్ ఎన్టీఆర్ బతికే ఉన్నాడా అంటూ ప్రశ్నిస్తున్నారు అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడి అయి ఉండి చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం స్పందించట్లేదు అని అడుగుతున్నారు.సోషల్ మీడియాలో కూడా ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తుండడం తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో టిడిపి నేతలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
చంద్రబాబు చేసిన తప్పుకు ఆయన అరెస్టు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు ( Chandrababu Naidu ) ఏమైనా దేశం కోసం లేదా రాష్ట్రం కోసం జైలుకు వెళ్లారా ? అలా వెళ్తే అందరికంటే ముందు ఎన్టీఆర్ స్పందిస్తాడని తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పుడు తారక్ గుర్తుకు వస్తున్నాడా మీకు.గతంలో చంద్రబాబు కేవలం నందమూరి ఫ్యామిలీని తన ప్రోగ్రామ్స్ పిలిచి ఎన్టీఆర్ ను దూరం పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు మొదటి నుంచి ఎన్టీఆర్ ను కావాలనే నందమూరి ఫ్యామిలీకి దూరం పెట్టేలా చేశాడు.ఇప్పుడేమో ఆయన అరెస్ట్ అయితే ఎన్టీఆర్ స్పందించాలనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మంచి చేసే కార్యక్రమంలో భాగంగా ఏదైనా జరిగితే ఎన్టీఆర్ ఖచ్చితంగా స్పందిస్తాడని , కొద్దిరోజుల క్రితం నారా భువనేశ్వరుని అసెంబ్లీలో అవమానిస్తే ఎన్టీఆర్ స్పందించిన విషయం మీకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు.మీడియా, సోషల్ మీడియాలో టిడిపి నేతలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ఈ విషయం పై వివాదం కొనసాగుతోంది.