జగన్ దూకుడు వెనుక బీజేపీ ? భోరోసా లభించిందా ? 

ఏపీ విషయంలో బీజేపీ తీరు చిత్ర విచిత్రంగా ఉంది .ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఒకరకంగా వ్యవహరిస్తుంటే, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం మరో విధంగా వ్యవహరిస్తున్నారు.

 Central Bjp Leaders Supporting Ys Jagan Politics,bjp, Tdp, Ysrcp, Ap, Jagan, Cha-TeluguStop.com

దీంతో అసలు ఏం జరుగుతోంది అనేది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది.ఏపీ రాజకీయాలు విషయాన్ని పక్కన పెడితే,  కేంద్రంలో బిజెపికి జగన్ అవసరం చాలానే ఉంది.

ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఆ పార్టీ అవసరం చాలానే ఉంది.దీనికితోడు వైసీపీ ఎంపీలు కూడా అవసరమైన సందర్భంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారు.

కీలకమైన బిల్లుల విషయంలో బీజేపీ నిర్ణయానికి అనుగుణంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.ఇప్పటికే ఎన్డీయే నుంచి అనేక మిత్రపక్షాలు తప్పుకున్న పరిస్థితుల్లో జగన్ వంటి బలమైన నాయకులను వదులుకునేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు.

Telugu Bjp Jagan, Centralbjp, Chandrababu, Jagan, Modhi, Prime, Smith Sha, Ysrcp

దీనికి తోడు బీజేపీ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడంతో , రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి పెద్దలు ముందుకు వెళ్తున్నారు.ఇక బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర బిజెపి పెద్దలు ఏమాత్రం పట్టించుకోకపోవడానికి  కారణం ఇదేనట.గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు,  కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వంటి విషయాలను బీజేపీ పెద్దలు  సీరియస్ గా తీసుకున్నారట.బాబును నమ్ముకుని రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనేకంటే జగన్ వంటి బలమైన నాయకుడికి అండదండలు అందిస్తే , రాబోయే రోజుల్లో తమకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో మోదీ, అమిత్ షా వంటి వారు ఉండటంతోనే ఏపీలో జగన్ ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు వెనుక , జగన్ ధైర్యంగా దూసుకెళ్తుండడం వంటి వాటికి బిజెపి పెద్దల భరోసా నే కారణంగా తెలుస్తోంది.  గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వాన్ని రఘురామ ఇబ్బంది పెడుతున్న,  జగన్ సైలెంట్ గా ఉన్నారు .రఘురామ కు బిజెపి మద్దతు ఉంది అనే ప్రచారం సైతం జరిగింది .అయితే అనూహ్యంగా ఆయన అరెస్టు కావడానికి ముందే అమిత్ షా ఈ విషయంలో జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే విషయాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పుకొచ్చారు.దీనికి తగ్గట్టుగానే  జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కొద్ది రోజుల క్రితం రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ లో మరికొంత కాలం గడువు కావాలంటూ సీబీఐ కోరడం తో జగన్ బెయిల్ విషయంలో ఏదో జరుగుతోంది అనే సందేహాలు మొదలయ్యాయి.బిజెపి అండదండలు జగన్ కు ఉండడంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube