గర్భందాల్చిన స్త్రీలు పూజలు చేయవచ్చా? లేదా?

మన హిందూ సాంప్రదాయాలు ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేక రోజులు రావడం వల్ల మహిళలు నిత్యం పూజలు వ్రతాలలో పాల్గొంటారు.అంతేకాకుండా వారంలో ఇష్టదైవ రోజున ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

 Can Pregnant Women Worship Or Not, Pregnant Women, Worship, పూజలలో �-TeluguStop.com

మరికొంతమంది ఎంతో ఆసక్తిగా దేవాలయాలను దర్శించడం, పూజలు, వ్రతాలులో పాల్గొనడం ఎంతో ఆసక్తి ఉంటుంది.ఇవే కాకుండా కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి ప్రత్యేకమైన నెలలో మహిళలు ఉపవాస దీక్షలతో పూజలు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.

అయితే ఇలాంటి నోములు వ్రతాలు చేయడం సాధారణ మహిళలు అయితే ఎంతో సునాయాసంగా చేస్తారు.కానీ చాలా మందిలో గర్భవతులు ఇలాంటి పూజలు, వ్రతాలు చేయవచ్చా? చేయకూడదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.అయితే ఇలాంటి పూజలలో గర్భవతులు పాల్గొనవచ్చా లేదా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…

మన శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో గర్భందాల్చిన స్త్రీ ఉంటే వారి కుటుంబ సభ్యుల ప్రభావం స్త్రీపై, కడుపులో పెరుగుతున్న శిశువు పై ఎక్కువగా ఉంటుంది.అందుకోసమే ఒక స్త్రీ గర్భం దాల్చి మూడు నెలలు దాటిన తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు అంటే కొత్త ఇంటి నిర్మించడం, లేదా ఇంటిని రీ మోడలింగ్ చేయడం, వంటివి చేయకూడదని చెబుతుంటారు.

అయితే పూజలు చేయవచ్చా లేదా అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెబుతుంటారు.

Telugu Hindu, Pregnant, Worship-Telugu Bhakthi

మన ఇంట్లో గర్భందాల్చిన స్త్రీ ఎటువంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదని చెబుతారు.అంతేకాకుండా దేవాలయాలను కూడా దర్శించకూడదు.ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు దేవుని సన్నిధి నందు కొబ్బరికాయను కొట్టకూడదు.

అలాగే దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని చెబుతుంటారు.అయితే దేవాలయాలను దర్శించుకోకుండా మన ఇంటిలోనే స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడిని తలుచుకో వటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

గర్భవతులు దేవాలయాలను దర్శించకూడదు అనే దానిలో కొంతవరకు ఆరోగ్య పరంగా మంచిదని చెబుతుంటారు.గర్భం ధరించిన మహిళలు దేవాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయడం వల్ల, లేదంటే దేవాలయం మెట్లు ఎక్కడం వల్ల, ఉపవాస దీక్షలో పాల్గొని పూజలు చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడి కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి.

కాబట్టి గర్భవతులు పూజలలో పాల్గొనకూడదని చెప్పటానికి ఇదొక కారణమని మరికొందరు భావిస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube