జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కూడా పవన్ ప్రకటించడం తెలిసిందే.ఇదే సమయంలో ప్రజలతో సమావేశం అవుతూ ఉన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.రకరకాల ప్రజలతో పార్టీ కార్యాలయాల్లో సమావేశం అయ్యి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చేయబోయే పనులను వివరిస్తున్నారు.
ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో వైసీపీ( YCP ) పార్టీ గద్దె దించాలని అదే తన టార్గెట్ అని తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ తెలియజేస్తూ ఉన్నారు.
ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కష్టపడి పని చేయాలని తెలియజేస్తూ ఉన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి పనిచేయాలని గొడవలు పడకుండా.గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ బాధ్యతలను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసుకి( Bunny Vasu ) పవన్ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.
పార్టీ ఆశయాలను కీలకమైన ఈ విభాగం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ గెలుపు కోసం.
బలోపేతం కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బన్నీ వాసునీ పవన్ కళ్యాణ్ సూచించారు.