సాధారణంగా తల్లులు తమ పిల్లల ఏదైనా తప్పు చేస్తే కఠినంగా మందలిస్తుంటారు.ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటారు.
ఇది తమ మంచి కోసమే అని ఆలోచించే సామర్థ్యం చిన్నపిల్లలకు ఉండదు.అందుకే వారు చాలా మనస్థాపానికి గురవుతారు.
అలాంటి సమయంలో తల్లులు తమ పిల్లలను దగ్గరికి తీసుకొని, ఎందుకు కొట్టామనేది వివరిస్తూ వారిని మంచి చేసుకోవాలి.లేదంటే ఆ పిల్లలు మరింత కుంగిపోయి ఏదైనా చేసుకునే ప్రమాదం ఉంది.
అలాగే భరించలేనంతగా వారిని కొట్టకూడదు.అయితే దురదృష్టం కొద్దీ చైనాలో( China ) ఒక తల్లి తన పిల్లోడిని బాగా కొట్టేసింది.
ఆ సమయంలో అతడి ఎంత బాధ పడుతున్నాడు అనేది ఆమె పట్టించుకోలేదు.దీనివల్ల అతడు ఐదంతస్తుల భవనం( 5 Story Building ) పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజాగా చోటు చేసుకున్న ఈ సంఘటన చైనా దేశమంతటా విషాదఛాయలను నింపింది.వివరాల్లోకి వెళ్తే తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లితో కలిసి ఆరేళ్ల బాలుడు నివసిస్తున్నాడు.అయితే ఒకరోజు ఏదో చిన్న తప్పు చేసిన కారణంగా ఈ బాలుడిని తల్లి కర్రతో కొట్టింది.దాంతో బాలుడు( Boy ) కేకలు వేస్తూ చాలా పెద్ద పెద్దగా అరిచాడు.
అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అబ్బాయిని కొట్టొద్దని తల్లిని( Mother ) కోరారు.ఈ సమయంలోనే ఆ పిల్లోడు తన అపార్ట్‌మెంట్ నుంచి బయటికి వచ్చాడు.
ఆ తర్వాత ఔట్‌డోర్ ఏసీ మెషీన్ నుంచి కిందికి దూకేశాడు.
దాంతో తల్లి ఒక్కసారిగా గుండె పగిలింది.బాలుడు అంత పైనుంచి కిందపడగా అది చూసి స్థానికులు ఉరుకులు పరుగులు తీశారు.అప్పటికే బాలుడి శరీరం నుంచి రక్తం వరదలై పారింది.
చాలా అవయవాలు విరిగిపోయాయి.సమయానికి స్థానికులు హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించడం వల్ల అతడు ప్రాణాలతో బయటపడగలిగాడు.
అయినా ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉంది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.