అమెరికాకు చెందిన స్కై కాస్ట్నర్( Sky Castner ) అనే 18 ఏళ్ల యువతి హార్వర్డ్ యూనివర్శిటీలో న్యాయ విద్యను చదవడానికి సిద్ధమవుతోంది.నిజానికి ఈ యువతి తన తల్లి జైలులో ఉండగానే జన్మించింది.
జైల్లో పుట్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ఆమె చదవడానికి రెడీ అయింది ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.తల్లి జైల్లో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెను సింగిల్ పేరెంట్‌గా పెంచారు.
ఆమె చదువుకు ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నారు.
స్కై ఇటీవల టెక్సాస్‌లోని కాన్రో హై స్కూల్( Conroe High School ) నుంచి పట్టభద్రురాలైంది.ఆమె మూడో తరగతిలో థర్డ్ ర్యాంకు సాధించి అదరగొట్టింది.ఆమె తన పాఠశాల విద్యలో అద్భుతమైన గ్రేడ్‌లను సాధించింది.
హార్వర్డ్‌లో స్థానం సంపాదించడానికి ముందు అకాడమీ ఫర్ హెల్త్ అండ్ సైన్స్ ప్రొఫెషన్స్‌లో చేరింది.హార్వర్డ్‌కు పంపించిన తన దరఖాస్తు లేఖను “నేను జైలులో పుట్టాను” అనే వాక్యంతో స్టార్ట్ ఈమె చేసింది.
స్కై విజయానికి కొంతవరకు ఆమె మెంటర్ మోనా హంబీ కారణమని చెప్పవచ్చు, ఆమె ప్రాథమిక పాఠశాలలో స్కైను కలుసుకుంది.మోనా స్కై సామర్థ్యాన్ని గుర్తించింది.ఆమెకు మార్గనిర్దేశం చేసేందుకు తన వంతు కృషి చేసింది.మెంటర్ మోనా స్కైతో సమయం గడుపుతూ ఆమెకు మంచి గైడెన్స్ ఇచ్చింది.స్కై ఎదుగుతున్నప్పుడు సవాళ్లు ఎదుర్కొంది.అయినా అధైర్య పడకుండా ముందుకు సాగింది.
స్కై తన 14 సంవత్సరాల వయస్సులో తనకు జన్మనిచ్చిన తల్లితో ఒక్కసారి మాత్రమే మాట్లాడింది.కష్టాల నుంచి హార్వర్డ్( Harvard University ) వరకు స్కై స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగించింది.
తండ్రి, గురువు మద్దతుతో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా ఆమె అడుగులు వేసింది.