తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ( TAUK ) అనే బృందం వెస్ట్ లండన్‌లో బోనాలు పండుగను ఘనంగా జరుపుకుంది.యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 1,200 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హౌన్స్లో మేయర్ అఫ్జల్ కియాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఏటా బోనాలు జరుపుకునే సికింద్రాబాద్‌లోని ‘లష్కర్( Lashkar )’ పండుగ వాతావరణాన్ని ఎన్నారైలు లండన్‌లో పునఃసృష్టించారు.
ఈ కార్యక్రమంలో పోతురాజు ఆటలు కట్టిపడేసాయి.లండన్ వీధుల్లో మహిళలు తొట్టెల ఊరేగింపు చేస్తూ బోనం ఎత్తారు.
కొంతమంది స్థానిక బ్రిటీష్ నివాసితులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
మేయర్ అఫ్జల్ కియానీ( Mayor Afzaal Kiani ) మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని పరాయి దేశంలో ప్రచారం చేయడంతోపాటు స్థానిక సమాజ సేవలో TAUK నిమగ్నమైందని ప్రశంసించారు.సామరస్యం, శాంతి, విభిన్న సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి స్థానిక బ్రిటీష్ నివాసితులను జాతరలో భాగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.భారతీయ, తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించడం, ప్రోత్సహించడం పట్ల ఎన్నారై మహిళలు పాటుపడుతున్నారని వారిని చూసి గర్వపడుతున్నానని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందున ఈ ఏడాది ప్రత్యేకత సంతరించుకున్నదని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టీఏయూకే కన్వీనర్ అశోక్ దుసరి( Ashok Dusari ) పేర్కొన్నారు.యూకేలో చదువుతున్న అక్షయ మల్చేల అనే విద్యార్థిని పోతరాజు వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్‌తో సహా వివిధ TAUK సభ్యులు కూడా పాల్గొన్నారు.