త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ యాత్రలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తెలంగాణలో ఇవాళ్టి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు ప్రారంభించనుంది.
ఈ మేరకు రాష్ట్ర నేతలతో కలిసి జాతీయ నేతలు ఈ యాత్రలను నాలుగు చోట్ల ప్రారంభించనున్నారు.బాసరలో ఎంపీ లక్ష్మణ్ తో కలిసి అసోం సీఎం, యాదగిరిగుట్టలో ఈటల రాజేందర్( Etela Rajender ) తో కలిసి గోవా సీఎం యాత్రలను ప్రారంభించనున్నారు.
అదేవిధంగా నారాయణ పేట జిల్లా మక్తల్ లో కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల, తాండూరులో బండి సంజయ్ తో కలిసి కేంద్రమంత్రి బీఎస్ వర్మ విజయసంక్పల యాత్రలను ప్రారంభించనున్నారు.
కాగా మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఈ యాత్ర కొనసాగనుంది.ఇందులో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలతో పాటు 79 ఈవెంట్స్ ను బీజేపీ( BJP ) నిర్వహించనుంది.సుమారు 12 రోజులపాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.