Telangana BJP: నేటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయసంకల్ప యాత్ర
TeluguStop.com
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ యాత్రలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తెలంగాణలో ఇవాళ్టి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు ప్రారంభించనుంది.ఈ మేరకు రాష్ట్ర నేతలతో కలిసి జాతీయ నేతలు ఈ యాత్రలను నాలుగు చోట్ల ప్రారంభించనున్నారు.
బాసరలో ఎంపీ లక్ష్మణ్ తో కలిసి అసోం సీఎం, యాదగిరిగుట్టలో ఈటల రాజేందర్( Etela Rajender ) తో కలిసి గోవా సీఎం యాత్రలను ప్రారంభించనున్నారు.
అదేవిధంగా నారాయణ పేట జిల్లా మక్తల్ లో కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల, తాండూరులో బండి సంజయ్ తో కలిసి కేంద్రమంత్రి బీఎస్ వర్మ విజయసంక్పల యాత్రలను ప్రారంభించనున్నారు.
"""/" /
కాగా మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఈ యాత్ర కొనసాగనుంది.
ఇందులో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలతో పాటు 79 ఈవెంట్స్ ను బీజేపీ( BJP ) నిర్వహించనుంది.
సుమారు 12 రోజులపాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర కొనసాగనుంది.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్న బాలయ్య…కారణం ఏంటి..?