తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా ఈనెల 21 నుంచి తెలంగాణలో బీజేపీ నేతల బస్సు యాత్ర నిర్వహించనుంది.
ఈ మేరకు బస్సు యాత్ర కోసం మూడు రూట్లను తెలంగాణ బీజేపీ సిద్ధం చేసింది.బాసర, సోమశిల, భద్రాచలం నుంచి బస్సు యాత్రను బీజేపీ ప్రారంభించనుందని తెలుస్తోంది.
అదేవిధంగా ప్రతి బస్సు యాత్రకు నలుగురు నాయకులలో ఒకరు నాయకత్వం వహిస్తారని సమాచారం.బస్సు యాత్రల సందర్భంగా ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో 119 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.బస్సు యాత్రలతోపాటు బహిరంగ సభలను 15 రోజుల్లోనే పూర్తి చేసేలా బీజేపీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారని సమాచారం.