టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది చేదు అనుభవమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందని ప్రజలకు కూడా తెలిసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.అవినీతి కేసుల్లో ఇన్నాళ్లూ స్టేలతో చంద్రబాబు తప్పించుకున్నారని విమర్శించారు.
చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని కొందరు అంటున్నారన్నారు.మూడు రాజధానులు, పేదలకు ఇళ్లు అంశాలపై స్టే ఇచ్చినప్పుడు సమర్థించారన్న మంత్రి పెద్దిరెడ్డి వీటిని సమర్థించిన వాళ్లు చంద్రబాబు అరెస్టును ఎందుకు సమర్థించరని ప్రశ్నించారు.
చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని, అవన్నీ బయటకు వస్తే చంద్రబాబు ఎలా స్పందిస్తారోనని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే సీపీఐ, జనసేన, పురంధేశ్వరి అందరూ కలిసి ఏం మేనేజ్ చేయాలనుకుంటున్నారో తెలియడం లేదన్నారు.
పతనం, భయమంటే ఏంటో చంద్రబాబుకు జగన్ తెలియజేశారని వెల్లడించారు.