ప్రస్తుత జనరేషన్ లో విడాకులు, ప్రేమ,పెళ్లి ఈ పదాలు అన్నీ కూడా కామన్ అయిపోయాయి.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సినీ ఇండస్ట్రీలో ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.
ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకున్న కొన్ని ఏళ్లకే విడిపోతున్నారు.ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా పలువురు జంటలు విడిపోయిన విషయం తెలిసిందే.
సాంకేతికత పెరిగేకొద్దీ సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రస్తుత కాలంలో భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.
ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా బెంగాలీ నటి కొంకణా సేన్ శర్మ విడాకుల విషయం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కొంకణా సేన్ శర్మ నటుడు రణవీర్ షోరే 2010లో ఒక్కటయ్యారు.
ఆ తర్వాత దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు కలిసి వైవాహిక జీవితాన్ని గడిపారు.అనంతరం 2015లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అప్పుడు విడిపోయి ఎవరి జీవితం వారిది అన్నట్టుగా స్వేచ్ఛగా బతికేస్తున్నారు.
ఆ తర్వాత 2020లో కోర్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొంకణా సేన్ శర్మ తన భర్తను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సమాజంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అదే విధంగా వాటిని నేర్చుకునే ప్రయత్నం కూడా చేయాలి.కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి.ఆమె భర్త అతనికి సంబంధించిన విషయాల గురించి ఎలాగైనా అనుకోవచ్చు.అంతా అతను ఇష్టం అన్నట్టుగా భావిస్తాడు అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడింది.అయినా జనాల కోసం సమాజం కోసం అన్నింటిని భరిస్తూ కలిసి ఉండటం నావల్ల కాదు.నాకంటూ ప్రత్యేక గది ఉండాలి, బాత్రూం ఏసీ వంటి కొన్ని సౌకర్యాలు స్పెషల్ గా ఉండాలి.
కొన్ని కొన్ని సార్లు ఎవరి అనుమతి తీసుకోకుండా నాకు నచ్చిన విధంగా ఉండడంతోపాటు నచ్చిన పనులు చేసుకుని ఉండాలి అని తెలిపింది కొంకణా సేన్ శర్మ.ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.