నాగబాబు వరుస కామెంట్స్‌కు బాలయ్య రియాక్షన్‌ ఇది... కాస్త ఆగండి అందరి దూల తీర్చుతాడట!     2019-01-08   14:45:08  IST  Ramesh Palla

బాలకృష్ణ గతంలో తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌, తమ కుటుంబంపై, జనసేనపై చేసిన విమర్శలను పరిగణలోకి తీసుకుని నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెల్సిందే.

Balakrishna Reaction About Nagababu Comments-Chiranjeevi Nagababu Comments Pawan Kalyam

Balakrishna Reaction About Nagababu Comments

వరుసగా కామెంట్స్‌ రూపంలో వీడియోలు వదులుతూ నాగబాబు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. బాలకృష్ణ ఒక్కో విమర్శను తీసుకుని దాన్ని కౌంటర్‌గా మాట్లాడుతూ నాగబాబు వదులుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో సంచలనం అవుతున్నాయి. మీడియాలో వస్తున్న ఈ వీడియోలు ప్రస్తుతం మెగా వర్సెస్‌ నందమూరి అన్నట్లుగా సాగుతోంది.

మెగా బ్రదర్‌ నాగబాబు వరుస విమర్శలపై తాజాగా బాలకృష్ణను తిరుపతిలో స్పందించాల్సిందిగా మీడియా వారు కోరారు. అయితే ప్రస్తుతం అందుకు సమయం కాదని, తాము ఎన్టీఆర్‌ సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చామని చెప్పుకొచ్చాడు. నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ సింపుల్‌గా నో కామెంట్‌ అన్నాడు. కాని బాలయ్య సన్నిహితులు మాత్రం నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ చాలా సీరియస్‌గా ఉన్నాడని, ఎన్టీఆర్‌ సినిమా విడుదలైన తర్వాత తన వాయిస్‌ వినిపిస్తాడంటూ చెబుతున్నారు.

తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నాగబాబు మాట్లాడటంపై బాలకృష్ణ చాలా సీరియస్‌గా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ సినిమా విడుదల సమయంలో ఈ వ్యవహారం వల్ల సినిమా విడుదల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్య సైలెంట్‌గా ఉంటున్నట్లుగా నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు. సంక్రాంతి తర్వాత బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.వరుసగా కామెంట్స్‌ రూపంలో వీడియోలు వదులుతూ నాగబాబు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు.

Balakrishna Reaction About Nagababu Comments-Chiranjeevi Nagababu Comments Pawan Kalyam