కాబొయ్యే వరుడిని పరిచయం చేసిన 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య..!

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకొని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న వారిని ఇది వరకు చాలా మందినే చూసి ఉంటారు.కానీ వాళ్లంతా ఒక లిమిట్ వరకే ఇండస్ట్రీ లో రాణించగలిగారు.

 Baby Movie Heroine Vaishnavi Chaitanya About Her Fiance Details, Baby Movie, Her-TeluguStop.com

కానీ ఏకంగా కుంభస్థలం బద్దలయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి, హీరోయిన్ గా స్థిరపడిపోయిన వాళ్ళని మాత్రం మొన్నటి వరకు చూసి ఉండరు.కానీ మొట్టమొదటిసారి అలాంటి రేంజ్ ని చూసిన అమ్మాయిగా వైష్ణవి చైతన్య ని( Vaishnavi Chaitanya ) మనం చూడొచ్చు.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చిన వైష్ణవి చైతన్య ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’( Software Developer ) అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకుంది.ఈ సిరీస్ తర్వాత వైష్ణవి చైతన్య కి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ, అన్నీ చెల్లెలి పాత్రలే.

కానీ ‘బేబీ’ సినిమాతో( Baby Movie ) ఈమె మొట్టమొదటిసారి పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ ని చేసింది.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది.కేవలం 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో దాదాపుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

Telugu Baby, Viraj Ashwin-Movie

ఇక ఈ సినిమాలో హీరోలు గా చేసిన ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) మరియు విరాజ్ అశ్విన్( Viraj Ashwin ) కంటే కూడా ఎక్కువగా మంచి పేరు వైష్ణవి చైతన్య కి వచ్చింది.ఈ సినిమా తర్వాత వరుసగా ఆమెకి అవకాశాల వెల్లువ కురుస్తుంది.చూస్తూ ఉండగానే స్టార్ హీరోయిన్ రేంజ్ డిమాండ్ ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈమె గురించి వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ ని తెగ వెతికారు.

అలా వెతకగా ఈమె పాత ఇంటర్వ్యూస్ కొన్ని కనిపించాయి.

Telugu Baby, Viraj Ashwin-Movie

ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె తన కాబొయ్యే వరుడి గురించి( Fiance ) చెప్పుకొచ్చింది.తన కాబొయ్యే వరుడుకి పెద్దగా అందం లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కేవలం తనని బాగా చూసుకుంటే చాలు, నాకు మిగిలిన అమ్మాయిలు లాగా ఆకాశాన్ని తాకే అంచనాలు ఏమి లేవు, చాలా సింపుల్ లైఫ్ ని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.దీనితో సోషల్ మీడియా లో ఉన్న కుర్రాళ్ళు నాలో ఆ లక్షణాలు ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా వైష్ణవి చైతన్య త్వరలోనే సిద్దార్థ్ జొన్నలగడ్డ తో( Siddharth Jonnalagadda ) కలిసి ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube