బాబు బయటకు వచ్చేనా ?

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా టీడీపీ శ్రేణులు భావించే అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి విధితమే.ఓ మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలఃతో జైలుపాలు కావడం బహుశా ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి.

 Babu Will Come Out, Chandrababu Arrest , Skill Development , Sidharth Luthra ,-TeluguStop.com

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) తో ఏపీ రాజకీయాల వేడి తార స్థాయిలో కొనసాగుతోంది.బెయిల్ వస్తుందని బహించినప్పటికి కోర్ట్ రిమాండ్ విధంచడంతో బాబు కేసు ఎలా మలుపులు తిరుగుతుందో ఊహించలేని పరిస్థితి.

ఇక నిన్న ఏసీబీ కోర్టు వాడి వేడి వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచింతే.నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

అయితే తాజా పరిణామలను బట్టి చూస్తే అసలు చంద్రబాబు బయటకు వస్తారా ? ఒకవేళ రాకపోతే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

Telugu Ap, Chandrababu, Sidharth Luthra, Skill, Ys Jagan-Politics

సీఐడీ చెబుతున్నా దాని ప్రకారం.స్కిల్ డెవలప్ మెంట్( Skill development ) లో జరిగిన స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని అందుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని, చట్ట ప్రకారమే అరెస్ట్ జరిగిందని చెబుతోంది.అయితే అవన్నీ తప్పుకు ఆధారాలని టీడీపీ ఆరోపిస్తోంది.

మొదట ఈ కేసులో చంద్రబాబు ను ఏ1 గా పరిగణించగా.ఆ తరువాత ఏ30 గా చేర్చారు.

అలాగే చంద్రబాబు పేరు లేకుండానే ఆయనపై రిమాండ్ విధించారు.ఈ పరినమలన్నీ చూస్తే ఆయనను ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్ట్ చేశారనేది కొందరి వాదన.

Telugu Ap, Chandrababu, Sidharth Luthra, Skill, Ys Jagan-Politics

ఇక చంద్రబాబు తరుపు లాయర్ లూథ్రా కూడా ఇవే విషయాలను కోర్టు ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.దీంతో తీర్పును హోల్ద్ లో ఉంచిన ధర్మాసనం నేడు వెలువరించే అవకాశం ఉంది.అయితే ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకు వెళతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేనట్లేనని కొందరు అతివాదులు భావిస్తున్నారు.

మరోవైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం ల లేదు.దీంతో ఎన్నికల ముందు అధినేత జైలుపాలు కావడం టీడీపీకి కోలుకోలేని దేబ్బే అని చెప్పాలి.మరి బాబు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube