బీజేపీ నేత బాబుమోహన్ కుమారుడు ఉదయ్ భాస్కర్ బీఆర్ఎస్ గూటికి చేరారని తెలుస్తోంది.అందోల్ బీజేపీ టికెట్ ఆశించిన ఉదయ్ భాస్కర్ భంగపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉదయ్ భాస్కర్ బీజేపీని వీడారు.ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
కాగా అందోల్ నియోజకవర్గ టికెట్ ను ఉదయ్ ఆశించగా బాబుమోహన్ కూడా తన కొడుకుకే టికెట్ ఇవ్వాలని పార్టీని కోరారు.కానీ అనూహ్యంగా బీజేేపీ అధిష్టానం టికెట్ ను బాబుమోహన్ కు ఇచ్చింది.