ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట( Rama in Ayodhya ) జరగగా ప్రస్తుతం వేల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వెళ్తూ రాముడిని దర్శించుకుంటున్నారు.మరికొన్ని నెలల్లో అయోధ్యకు ట్రైన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈ ఏడాది చివరినాటికి అయోధ్యలో భారీ సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
అయితే ప్రాణప్రతిష్ట రోజు జరిగిన ఒక ఘటన నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
సాధారణంగా పోయిన వస్తువులు దొరకడం అరుదుగా జరుగుతుంది.పుణ్యక్షేత్రాలకు ( shrines ) వెళ్లిన సమయంలో పోయిన వస్తువులు దొరకడం సాధారణంగా జరగదు.80 సంవత్సరాల వయస్సు ఉన్న జానకి ( janaki )అనే తమిళనాడుకు చెందిన వృద్ధురాలు 63,550 రూపాయల నగదుతో పాటు గుర్తింపు కార్డ్ ఉన్న పర్సును ప్రాణప్రతిష్ట రోజున పోగొట్టుకున్నారు.అయితే రాముడిపై భక్తితో మొదట దేవుడిని దర్శించుకున్న వృద్ధురాలు దేవుడిని తన పర్సు తిగిగి తనకు దక్కేలా చూడాలని కోరారు.
ఆమె కుటుంబ సభ్యులు పర్సు గురించి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అయితే ఆ పర్సు హరిద్వార్ కు చెందిన సుధా ప్రేమానంద్ మహరాజ్( Sudha Premanand Maharaj ) అనే సన్యాసి బ్యాగ్ లో పొరపాటున పడిపోగా సాధువు ఆ పర్సులోని గుర్తింపు కార్డ్ ఆధారంగా ఆ వృద్ధురాలికి పర్సు చేరేలా చేశాడు.బాలరాముడిని పర్సు దొరకాలని కోరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె పర్సు పోలీసుల ద్వారా చేరింది.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇదంతా ఆ శ్రీరాముని లీల అని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.అయోధ్య రాముడిని దర్శించుకోవాలని కోరుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.అయోధ్య రాముని హుండీ లెక్కలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయోధ్య రాముడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలామంది భక్తులు భావిస్తున్నారు.