తెలంగాణలో మేడారం మహా జాతర( Medaram Jatara )కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వకు మహా జాతర జరగనుంది.
ఈ క్రమంలో ఇప్పటి నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు.ములుగు జిల్లా తాడ్వాయి మండలం( Tadwai )లోని జంపన్న వాగు( Jampanna Vaagu )లో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పిస్తున్నారు.అనంతరం వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.ఈ క్రమంలో అమ్మవార్లకు చీర, సారె, పసుపు, కుంకుమతో పాటు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర( Chhattisgarh, Maharashtra ) మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
.