ఏపీలో ఎన్నికల్లో పెద్దఎత్తున మహిళలు , వృద్దులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు.ఎప్పుడూ లేనంత స్థాయిలో పోలింగ్ శాతం ఏపీలో బాగా పెరిగింది.
సుమారు ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదయ్యింది.ఇదే సమయంలో తెలంగాణ లోక్ సభ ఎన్నికలల్లో ఓటింగ్ శాతం బాగా తక్కువ నమోదయ్యింది.
ఈ నేపథ్యంలో ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం ఎవరి కొంప ముంచుతుందో అన్న ఆందోళన అన్నిపార్టీల్లోనూ కనిపిస్తోంది.వాస్తవంగా ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీని బట్టి.
ఫలానా వారికి అనుకూలం అని చెప్పడం సాధ్యం కాదు.
ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ.
అందులోనూ ఎనభై శాతం పోలింగ్ నమోదయింది.కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా ఓటర్లు.
ఓటు హక్కు వినియోగించుకున్నారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ బాగా పెరిగింది కాబట్టి అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని అంతా భావించారు.
ఆ లెక్కల ప్రకారం టీఆర్ఎస్ ఓడిపోతుంది మహాకూటమి గెలుస్తుందన్న లెక్కలు బయటకి వచ్చాయి.కానీ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి.
అలా అని చెప్పి ఏపీలోనూ అవే ఫలితాలు వస్తాయనుకోవడానికి లేదు.అయితే తెలంగాణతో పోలిస్తే ఓటింగ్ ఎందుకు ఎక్కువగా ఉందనేదానికి అనేక కారణాలు ఉండొచ్చు.అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం హైలీ పోలరైజ్ రాజకీయ వాతావరణం ఏర్పడటం ఒకరికొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుని.హోరాహోరీగా పోరాడటం వంటి అంశాలు పోలింగ్ పర్సంటేజీ పెరగడానికి కారణాలు అయ్యి ఉండవచ్చు.
ఏపీలో ఓటింగ్ పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చు.వాలంటరీ ఓటింగ్ పెరిగింది.
మోటీవేటెడ్ ఓటింగ్ పెరిగింది.మొబిలైజ్డ్ ఓటింగ్ కూడా పెరిగింది.
అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏపీలో ఎన్నికల ఓటింగ్ శాతం బాగా పెరిగింది.