వాట్సాప్ గ్రూపుల్లో ఏపీ పదో తరగతి పరీక్ష పేపర్ లీక్..!!

ఏపీ పదో తరగతి పరీక్ష పేపర్‌ లీక్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.నిజానికి మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏవీ లేకుండా 10వ తరగతి పరీక్షలు చాలా కట్టుదిట్టంగా కండక్ట్ చేస్తారు.

 Ap Tenth Class Exams Question Paper Leak Details, Whatsapp, Exam Paper, Lekage,-TeluguStop.com

అయితే ఏపీలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఐతే ఎగ్జామ్స్ మొదలైన మొదటి రోజే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం అందరినీ నివ్వెరపరుస్తోంది.

పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే ఇలా వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈరోజు కంపోసిట్ తెలుగు పేపర్‌ వన్‌ పరీక్ష జరగుతుంది.

అయితే పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ఇలా తెలుగు పేపర్ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో హల్ చల్ చేసింది.ఈ పరీక్ష పేపర్ లీక్ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.ఈ రోజు ఉదయం 9 గంటలకు పదవ తరగతి పరీక్ష ప్రారంభమైతే సరిగ్గా 9.57 కి పదవ తరగతి క్వశ్చన్‌ పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టింది.అయితే ఈ ఏడాది నుంచి విద్యార్థులు అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తున్నారు అధికారులు.

Telugu Ap, Aptenth, Ap Tenth Exams, Chittoor, Exam Paper, Lekage, Paper Leak, Te

ఈ సమయంలో ఇలా ప్రశ్న పత్రం లీక్ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు ఈ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీకైంది.ఎవరు లీక్ చేసారనే విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

రెండు సంవత్సరాల తరువాత ఇలా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా పదో తరగతి పరీక్షల కారణంగా ఎగ్జామ్ సెంటర్స్ నిర్వహిస్తున్న స్కూళ్లల్లో పని సమయాలు మార్పులు చేసారు.6 నుంచి 9 తరగతులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4.45 గంటల వరకు స్కూల్ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube