రేపు రాష్ట్ర అవతరణ వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతర దినోత్సవం నవంబర్‌ 1 అనే విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ విడిపోయి జూన్‌ 2న కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయ్యింది.

 Ap State Incarnation Ceremonies Tomorrow-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కూడా జూన్‌ 2న గత ప్రభుత్వం నిర్వహించింది.ఏపీ అవతరణ దినోత్సవంను వేడుకగా జరుపుకోకుండా జూన్‌ 2వ తారీకున ఒక నిరసన దినోత్సవంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరుపుకుంటూ వచ్చింది.

కాని కొత్తగా వచ్చిన జగన్‌ ప్రభుత్వం పాత పద్దతిని చంద్రబాబు నాయుడు అవలంభించిన పద్దతికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాడు.ఏపీ ఆవిర్భావ దినోత్సవంను నవంబర్‌ 1నే జరుపుకోవాలని నిర్ణయించారు.

ఏపీ అవతరణ దినోత్సవంను నవంబర్‌ 1న జరుపుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దాంతో రేపు ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ కార్యలయాల వద్ద జాతీయ జెండాలు ఎగుర వేయడంతో పాటు జాతీయ గీతంను ఆలపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా ఏపీ అవతరణ దినోత్సవంను జరపాలని, ఇకపై నవంబర్‌ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంను నిర్వహించుకోవాలంటూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.మరి జగన్‌ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే మళ్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవం మారుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube