వైరల్ : ఏపీ డిప్యూటీ సీఎం టిక్ టాక్

ఏదో ఒక విషయంతో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.ఆమె ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు.

 Ap Diputy Cm Pushpa Srivani Tiktok-TeluguStop.com

ఉత్తరాంధ్ర జిల్లాలోని విజయనగరం జిల్లాకు చెందిన ఈమె విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు.గతంలో ఆమె విశాఖలోని మరికావలలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్సు ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆమె ఎగ్జిబిషన్ కు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా డాన్స్ చేశారు.

విద్యార్థులు ముందుగా డ్యాన్స్ చేస్తుండగా ఆమె కూడా విద్యార్థుల్ని ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి సరదాగా డ్యాన్స్ వేసిన వీడియో అప్పుడు వైరల్ అయ్యింది.దీంతో అప్పట్లో ఆమె పేరు మారుమోగింది.

తాజాగా ఆమె చేసిన టిక్‌టాక్ వీడియో కూడా అదే రేంజ్ లో వైరల్‌గా మారిపోయింది.సీఎం జగన్‌ను పొడుగుతూ టిక్‌టాక్‌లో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న ఓ సాంగ్‌ను అనుకరించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ సాగే పాటకు ఆమె అనుకరిస్తూ చేసిన టిక్‌టాక్ వీడియో బాగా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆమె వీడియో ను నెట్ జెన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube