న్యూస్ రౌండప్ టాప్ 20

1.సాగర్ నామినేషన్ల స్క్రూట్ని ప్రారంభం

నల్గొండ జిల్లాలోని నిడమానూరు వీఆర్వో కార్యాలయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల స్క్రూట్ని నేడు ప్రారంభం అయ్యింది.ఏప్రిల్ 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు.

 Andhra And Telangana News, Breaking Headlines, Top20 News, Telangana Political N-TeluguStop.com

2.మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యా శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆరో తరగతి లో ప్రవేశాలతో పాటు , ఏడు నుంచి పదో తరగతిలో ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

3.మిక్సర్ గ్రైండర్ లో బంగారం తరలింపు

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోటి 15 లక్షల విలువ చేసే బంగారం పట్టు బడింది.దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా మిక్సర్ గ్రైండర్ లోని కటింగ్ మిషన్ లో 2.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

4.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.ఏప్రిల్ 6న ఎఫ్బోవో నడక పరీక్ష

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నడక పరీక్ష నిర్వహిస్తున్నట్లు టిఎస్పిఎస్సి తెలిపింది.

6.రామ్ కి కేసు విచారణ రేపటికి వాయిదా

రాంకీ కేసు విచారణను సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో రామ్ కి కేసులో నిందితుల పిటిషన్ పై సిబిఐ కోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి.

7.తిరుపతి బిజెపి అభ్యర్థి పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రత్నప్రభ పై రిటర్నింగ్ అధికారికి జనతాదళ్ ,( యూ) నేత ఏవి రమణ ఫిర్యాదు చేశారు.కామినేషన్ పత్రాల్లో తనపై కేసులు లేవని రత్నప్రభ పేర్కొన్నారు.అయితే బంజారా హిల్స్ ,సైఫాబాద్, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లలో రత్నప్రభ పై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని రమణ ఆరోపించారు.

8.శరత్ పవార్ కు శస్త్రచికిత్స విజయవంతం

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స విజయవంతమైందని మహారాష్ట్ర హోంమంత్రి రాకేష్ తోపే వెల్లడించారు.

9.విజయవాడలో చైర్మన్లు మేయర్ లకు ప్రత్యేక శిక్షణ

కొత్తగా ఎన్నికైన చైర్మన్లు వైస్ చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది.మంత్రి బొత్స,  పురపాలక సంఘం ప్రత్యేక కార్యదర్శి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

10.‘నాడు – నేడు ‘ కు లైన్ క్లియర్

రాష్ట్రంలో ‘ మనబడి నాడు-నేడు ‘ కార్యక్రమం రెండో దశ కింద 16,345 ప్రభుత్వ విద్యా సంస్థల్లో 4,446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

11.కెసిఆర్ పై వైఎస్ షర్మిల ఆగ్రహం

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో 26 కరువు మండలాలుగా ఉండటం దారుణమని మండిపడ్డారు.

12.షార్ లో ఉద్యోగుల ఆందోళన

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.రెండో గేటు వద్ద ఉన్నత ఉద్యోగులను లోపలికి వెళ్ళనీయకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు.

13.విశాఖలో ఉక్కు నిర్వాసితుల పాదయాత్ర

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వాసితులు బుధవారం విశాఖ లో పాదయాత్ర నిర్వహించారుు

14.ఓటు హక్కు కోసం కోర్టుకు వెళతా : నిమ్మగడ్డ

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.ఏపీ లో తన ఓటు హక్కు కలెక్టరేట్ వద్ద పెండింగ్ లో ఉందని , ఓటు హక్కు కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

15.ఢిల్లీ విమానాశ్రయంలో నేటి నుంచి కోవిడ్ పరీక్షలు

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ప్రయాణికులకు నేటి నుంచి కరోనా పరీక్షలు ప్రారంభించారు.

16.మెదక్ జిల్లా అభిమానంతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

మెదక్ జిల్లా వైయస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

17.నాలుగు సిటీల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

కరోనా కేసులు ఉధృతి పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ , సూరత్, వడోదర, రాజ్ కోట్ సిటీల్లో నైట్ కర్ఫ్యూ విధించారు.

18.భారత్ కు మరో మూడు రాఫెల్ విమానాలు

మరో మూడు రాఫెల్ జెట్ విమానాలు బుధవారం ఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరుకున్నాయి.

19.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Cm Kcr, Covid, Lockdown, Maharashtra, Curfew, Telangana, Gold, Top-Latest

22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,690

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,630

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube