టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి అనంతరం వరుస సినిమాలలో అవకాశాలను అందుకొని అగ్రతారక పేరు సంపాదించుకున్నారు.ఈమె కేవలం కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా తన నటన ప్రతిభను కనబరిచారు.
ఇలా తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె అరుంధతి బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీలో ప్రభాస్ అనుష్క జోడి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య బాగా వర్కౌట్ కావడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని చాలామంది భావించారు.
ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందంటూ వార్తలు వచ్చాయి.అయితే అదంతా పూర్తిగా ఆవాస్తవమని తామిద్దరం మంచి స్నేహితులమని కొట్టి పారేశారు.
ఇక బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.అయితే ఈమె ఎలాంటి సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పూర్తిగా తన శరీర ఫిట్నెస్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది.ఇకపోతే అనుష్క సన్నిహితుల సమాచారం ప్రకారం అనుష్క ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అందుకే తాను ఇలా అధిక శరీర బరువు అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇలా అనారోగ్య సమస్య కారణంగానే ఈమె శరీర బరువు పెరగటం వల్ల తాను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని సన్నిహితుల సమాచారం.
మరి అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఆమె మాత్రం ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.