ప్రకాష్ రాజ్ పై అనుపమ ట్వీట్.! తూచ్ అది గొడవ కాదు. ఫన్నీ.! అసలు గొడవ అని ఎందుకు వైరల్ అయ్యింది?       2018-07-09   01:43:08  IST  Raghu V

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కు, సినిమాలో ఆమె తండ్రి పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ కు మధ్య కాస్త గట్టివాదన జరగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ సీన్ ఇలాచేస్తే బాగుంటుందని అనుపమకు ప్రకాష్ రాజ్ సూచించారని అయితే తనకు ఆ సీన్లో ఎలా నటించాలో తెలుసని….మీరు చెప్పనవసరం లేదని…అనుపమ మాట్లాడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మనస్తాపం చెందిన అనుపమ కన్నీళ్లు పెట్టుకుని అలాగే కుర్చీలో కూర్చుండిపోయిందని టాక్ వస్తోంది.

ఈ ఒక్క వదంతిని పట్టుకుని రకరకలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇది ఆ నోటా ఈ నోటా పాకి అనుపమకు చేరింది. అయితే వాటిలో నిజం లేదన్నట్టుగా అనుపమ, ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు. వదంతులకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అదంతా పెద్ద ‘జోక్’ అని ఎమోజీలతో ఆమె కామెంట్ చేసింది.