దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా స్కాం కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త అమన్ దీప్ ధల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.ఈ మేరకు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపరిచారు.
ఈ క్రమంలోనే అమన్ దీప్ ను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది.అయితే సీబీఐ కస్టడీపై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది న్యాయస్థానం.
కాగా గతంలో ఈడీ కేసులో అమన్ దీప్ అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.